బియ్యం కడగకుండా వంట చేస్తే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా..?

బియ్యం ఉడికించే ముందు శుభ్రంగా కడగడం చాలా ముఖ్యం. దీన్ని లైట్ తీసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్, టేస్ట్ మారిపోవడం, అజీర్తి లాంటి ఇష్యూస్ వస్తాయి. అంతేకాదు బియ్యాన్ని కనీసం 10 నిమిషాలు నీటిలో నానబెట్టడం కూడా మంచిది. మన ఇండియన్ మీల్స్‌ లో బియ్యం లేకుండా భోజనం కంప్లీట్ అవ్వదు. చాలా ఇళ్లలో రోజూ అన్నం వండటం కామనే. వండే ముందు బియ్యాన్ని కడగడం చాలా మంది చేసే నార్మల్ పని. కానీ బియ్యం కడగకపోతే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా..?

బియ్యం కడగకుండా వంట చేస్తే ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా..?
Rice

Updated on: Jul 17, 2025 | 8:55 PM

చాలా ప్యాకేజ్డ్ బియ్యం బ్రాండ్లు వండే ముందు కడగాలి అని క్లియర్‌ గా చెబుతుంటాయి. పండ్లు, కూరగాయలు మట్టిని, బ్యాక్టీరియాను తొలగించడానికి కడిగినట్లే.. బియ్యాన్ని కూడా శుభ్రంగా కడగాలి. ఫ్యాక్టరీ నుంచి మార్కెట్ వరకు ట్రాన్స్‌పోర్ట్ అయ్యే టైంలో బియ్యంలో దుమ్ము, ఇసుక, కలుషితాలు చేరుతాయి. అందుకే బియ్యం క్లీన్‌ గా కడగడం చాలా అవసరం. ఇప్పుడు మనం బియ్యం కడగకపోతే ఎదురయ్యే డేంజర్స్ గురించి తెలుసుకుందాం.

హెల్త్ ప్రాబ్లమ్స్

బియ్యం శుభ్రంగా కడగకపోతే అందులో ఉండే ధూళి, మురికి, సూక్ష్మజీవులు బాడీకి హాని చేయొచ్చు. ఇలాంటి బియ్యాన్ని రెగ్యులర్‌ గా తింటే జీర్ణ సంబంధిత సమస్యలు, అలర్జీలు లాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది.

టేస్ట్ మారిపోతుంది

కడగని బియ్యం వండినప్పుడు వింత టేస్ట్ వస్తుంది. కొన్నిసార్లు బియ్యం వాసనగా ఉండొచ్చు లేదా కాస్త చేదుగా కూడా అనిపించొచ్చు. దీని వల్ల భోజనం చేసే ఎక్స్‌పీరియన్స్ మొత్తం స్పాయిల్ అవుతుంది.

అతిగా ఉడికిన బియ్యం

బియ్యం కడగకపోతే కుకింగ్ టైంలో అతుక్కుపోవడం లేదా మరీ మెత్తగా ఉడికిపోయే ప్రమాదం ఉంటుంది. దాని వల్ల బియ్యం ఆకృతి, టెక్స్‌చర్ మీకు నచ్చకపోవచ్చు.

జీర్ణక్రియకు ఇబ్బంది

బియ్యం సరిగ్గా కడగకపోతే అది ఈవెన్‌ గా ఉడకకపోవచ్చు. అలా ఉడికిన బియ్యం మన జీర్ణక్రియకు కాస్త కష్టంగా మారుతుంది.

సరైన విధానం

కాబట్టి బియ్యం వండే ముందు కనీసం రెండు నుంచి మూడుసార్లు శుభ్రమైన నీటితో బాగా కడగాలి. ఇలా చేస్తే బియ్యం టేస్టీగా ఉండటమే కాకుండా హెల్త్‌కి కూడా మంచిది.

బియ్యాన్ని కడిగిన తర్వాత కనీసం 10 నిమిషాలపాటు నీటిలో నానబెట్టడం మంచిది. ఇలా చేస్తే బియ్యం త్వరగా.. ఈవెన్‌గా ఉడుకుతుంది. పైగా త్వరగా పాడవకుండా కూడా ఉంటుంది. ఇలా చేస్తే బియ్యం టేస్టీగా, హెల్దీగా, జీర్ణం అవ్వడానికి ఈజీగా తయారవుతుంది. ఈ టిప్స్ ఫాలో అయ్యి హెల్దీగా ఉండండి.