ఎవ్వరినైనా తాకితే షాక్ కొడుతుందా..? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?

కొన్నిసార్లు మనం ఎవ్వరినైనా తాకినప్పుడు చేతిలో ఓ చిన్న విద్యుత్ షాక్ లాంటి అనుభూతి కలుగుతుంది. ఇది కొద్దిసేపు అసౌకర్యంగా ఉంటుంది. వెంటనే మనం చేతి స్పర్శను తొలగించేస్తాం. ఇది అందరికీ జరగదు. కొంతమందిలో మాత్రమే కనిపించే సమస్య ఇది. దీనికి కారణం ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? ఇది మాయ కాదు. దీనికి శాస్త్రీయ కారణాలున్నాయి. ముఖ్యంగా విటమిన్ బి12 లోపం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.

ఎవ్వరినైనా తాకితే షాక్ కొడుతుందా..? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా..?
Electric Shock When Touching Person

Updated on: Jun 02, 2025 | 3:02 PM

విటమిన్ బి12 తక్కువగా ఉండే వారికి ఈ రకమైన షాక్ అనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్ శరీరంలో ఎర్ర రక్త కణాల తయారీకి ఉపయోగపడుతుంది. అదే సమయంలో మన నరాల ఆరోగ్యానికి కూడా ఇది అవసరం. ఈ విటమిన్ తక్కువైతే నరాలు బాగా పని చేయలేవు. అందుకే స్పర్శ సమయంలో విద్యుత్ లాంటి అనుభూతి కలగవచ్చు.

విటమిన్ బి12 శరీరంలో చాలా ముఖ్యమైన పనులు చేస్తుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరంలోని డిఎన్ఎ తయారీకి కూడా సహాయపడుతుంది. ముఖ్యంగా నరాల నిర్మాణంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విటమిన్ తక్కువగా ఉన్నప్పుడు నరాలు బలహీనంగా మారుతాయి. దీన్ని తగ్గించడానికి మాంసం, గుడ్లు, పాల సంబంధిత పదార్థాలు తినడం మంచిది. ఇవి విటమిన్ బి12ను సహజంగా అందిస్తాయి.

మన శరీరంలోని నరాలు మెదడు నుండి శరీరంలోని వివిధ భాగాలకు సంకేతాలను పంపుతుంటాయి. ఇవి ఎక్కడైనా దెబ్బతిన్నా, ఇబ్బంది వచ్చినా ఆ సంకేతాలు తప్పుగా పంపబడతాయి. దీని వల్ల షాక్ అనిపించవచ్చు. కొన్నిసార్లు సయాటికా వంటి నరాల సమస్యలు లేదా నరాలపై ఒత్తిడి పడటం కూడా కారణం కావచ్చు.

వెనుక భాగంలో గాయం జరిగినా లేదా వెన్నెముకకు సంబంధించిన ఏదైనా ఇబ్బంది ఉన్నా ఈ సమస్య రావచ్చు. డయాబెటిస్ ఉన్నవారికి ఈ షాక్ అనిపించడమే కాదు.. కొన్ని మందుల వల్ల కూడా నరాలపై ప్రభావం పడుతుంది. కొన్ని ఇన్ఫెక్షన్ల వల్ల కూడా నరాలకు ఇబ్బంది కలిగి స్పర్శ సమయంలో అసాధారణ స్పందన రావచ్చు.

ఇతరులను తాకినప్పుడు చెయ్యిలో షాక్ అనిపిస్తే అది చిన్న సమస్యగా భావించొద్దు. ఇది మీ శరీరంలో కొంత లోపం ఉందని సూచించే సంకేతం కావచ్చు. విటమిన్ బి12 స్థాయిలను పరీక్షించుకోవడం చాలా ముఖ్యం. అవసరమైన ఆహారం తీసుకుంటే ఈ సమస్య తగ్గవచ్చు. ఎక్కువగా కొనసాగితే వైద్యుని సంప్రదించండి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)