Right Age to give Birth: మహిళలు గర్భం దాల్చడానికి సరైన వయసు ఇదే.. పెరిగినా.. తగ్గినా ఇబ్బందులు తప్పవు..

మహిళలు తల్లులు కావడానికి సురక్షితమైన వయసు 23 నుంచి 32 ఏళ్ల మధ్య అని వివరించారు. ఈ పదేళ్ల కాలంలోనే పిల్లలను కనడానికి ప్రయత్నించాలని, తద్వారా అటు తల్లికి, ఇటు బిడ్డకీ ఇద్దరికీ ఆరోగ్యదాయకని వెల్లడించారు. పుట్టుకతో వచ్చే లోపాలు చాలా చాలా తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు.

Right Age to give Birth: మహిళలు గర్భం దాల్చడానికి సరైన వయసు ఇదే.. పెరిగినా.. తగ్గినా ఇబ్బందులు తప్పవు..
New Born Baby

Updated on: Jul 10, 2023 | 3:00 PM

సరైనా వయసు రాకుండా పెళ్లిళ్లు చేయొద్దు.. పిల్లల్ని కనొద్దు అంటూ మన ప్రభుత్వాలు అనేక రకాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. నిబంధనల ప్రకారం మేజర్లు అయిన తర్వాతే వివాహాలు చేసుకోవాలని సూచిస్తుంటాయి. అయితే కొన్ని గ్రామాల్లో ఇంకా ఇవి అమలు కావడం లేదనే చెప్పాలి. ఆడపిల్లలకు చిన్న వయసులోనే పెళ్లి చేయడం, ఆ వెంటనే వారు పిల్లలను కనడం జరిగిపోతోంది. మరికొంతమంది లేటు వయసు వచ్చే వరకూ పెళ్లిళ్లు చేసుకోకుండా ఉండి పోతున్నారు. ఉన్నత చదువులు, ఉద్యోగాలు అంటూ 30 ఏళ్లు దాటిపోయిన విహహాలు చేసుకోవడం లేదు. తద్వారా పిల్లల్ని కనడం కష్టతరమవుతుంది. సరైన వయసులో పిల్లల్ని కనకపోతే ఇబ్బందులు తప్పవు. అది తల్లికీ, బిడ్డకు అనారోగ్యదాయకం. అయితే మరి పిల్లల్ని కనడానికి మహిళలకు ఏది సరైన వయస్సు? ఏ వయసులో మహిళలు గర్భం ధరించడానికి అనువుగా ఉంటుంది? అటు ఆరోగ్య పరంగానూ.. అలాగే ఇతర ఉద్యోగ కార్యకలాపాల పరంగాను ఏ వయసులో కచ్చితంగా సరిపోతుంది?

ఇదే విషయమై హంగేరిలోని సెమ్మెల్వీస్ యూనివర్సిటీ పరిశోధకులు అధ్యయనం చేశారు. మహిళలు పిల్లలకు జన్మనివ్వడానికి సరియైన వయసును వారు కొనుగొన్నారు. తల్లులు కావడానికి సురక్షితమైన వయసు 23 నుంచి 32 ఏళ్ల మధ్య అని వివరించారు. ఈ పదేళ్ల కాలంలోనే పిల్లలను కనడానికి ప్రయత్నించాలని, తద్వారా అటు తల్లికి, ఇటు బిడ్డకీ ఇద్దరికీ ఆరోగ్యదాయకని వెల్లడించారు. పుట్టుకతో వచ్చే లోపాలు చాలా చాలా తక్కువగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన పూర్తి వివరాలు యాన్ ఇంటర్నేషన్ జర్మల్ ఆఫ్ అబ్ స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ(బీజేఓజీ) జర్నల్లో ప్రచురితమయ్యాయి.

జన్యుపరమైన సమస్యలు లేకుండా..

పరిశోధకులు మాట్లాడుతూ మహిళలు తల్లి కావడానికి సరైన వయసు అంటే కనీసం పదేళ్ల సురక్షితమైన వయసు కోసం అధ్యయనం కొనసాగించామన్నారు. అలా చేసిన అధ్యయనంలో ఎటువంటి జన్యుపరమైన ఇబ్బందులు లేకుండా బిడ్డకు జన్మనివ్వాలంటే 23 నుంచి 32 మధ్య పదేళ్ల కాలం సరైన సమయం అని నిర్ధారించామని చెప్పారు. 22 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిలో పుట్టిన వారిలో 20శాతం, అలాగే 32 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో పుట్టిన పిల్లల్లో 15శాతం క్రోమోజోమ్ కాని అసాధారణతలు అభివృద్ధి చెందే ప్రమాదం పెరిగిందని పరిశోధకులు కనుగొన్నారు. శాస్త్రవేత్తలు 1980, 2009 మధ్య హంగేరియన్ కేస్-కంట్రోల్ సర్వైలెన్స్ ఆఫ్ కన్జెనిటల్ అబ్నార్మాలిటీస్ నుండి డేటాను ఉపయోగించి, నాన్-క్రోమోజోమ్ డెవలప్‌మెంటల్ డిజార్డర్‌ల ద్వారా సంక్లిష్టమైన 31,128 గర్భాలను విశ్లేషించారు.

ఇవి కూడా చదవండి

ఈ లోపాలు ఉండొచ్చు..

యువ తల్లులను మాత్రమే ప్రభావితం చేసే అబ్నార్మాలిటీస్ లో, పిండం కేంద్ర నాడీ వ్యవస్థ వైకల్యాలు అత్యంత ప్రముఖమైనవి. 22 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో ఈ ప్రమాదం సాధారణంగా 25 శాతం పెరుగుతుంది. 20 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారిలో పెరుగుదల మరింత ఎక్కువగా ఉంటుంది.

వృద్ధ తల్లుల పిండాలను మాత్రమే ప్రభావితం చేసే అబ్నార్మాలిటీస్ లలో , తల, మెడ, చెవులు, కళ్లు పుట్టుకతో వచ్చే రుగ్మతల ప్రమాదం రెట్టింపు పెరుగుదలను (100 శాతం) చూపించింది, ఇది 40 ఏళ్లు పైబడిన గర్భాలలో గణనీయంగా గుర్తించారు.

జన్యుయేతర జనన రుగ్మతలు తరచుగా పర్యావరణ ప్రభావాలకు తల్లులు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల అభివృద్ధి చెందుతాయి. అభివృద్ధి చెందిన ప్రపంచంలో పిల్లలను కనే వయస్సు చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ధోరణికి తగిన విధంగా స్పందించడం గతంలో కంటే చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. మునుపటి పరిశోధన జన్యుపరమైన రుగ్మతలు (డౌన్ సిండ్రోమ్ వంటివి), తల్లి వయస్సు మధ్య పరస్పర సంబంధాన్ని నిర్ధారించింది.

మరిన్ని హెల్త్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..