Health: అదే పనిగా కాళ్లు ఆడిస్తున్నారా.? మీరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లే..

|

Oct 07, 2023 | 12:29 PM

కాళ్లను ఊపడం కేవలం ఒక అలవాటు మాత్రమే కాదని, ఇది ఒక వ్యాధి అని మీలో ఎంత మందికి తెలుసు.? అవును మీరు చదివింది నిజమే. నిత్యం కాళ్లను ఆడిస్తుండడం కూడా ఒకరకమైన ఆరోగ్య సమస్యే అని నిపుణులు చెబుతున్నారు. ఇలా కాళ్లను నిత్యం ఆడించడాన్ని వైద్య పరిభాషలో రెస్ట్‌లెస్‌ లెగ్స్‌ సిండ్రోమ్‌గా అభివర్ణిస్తున్నారు. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యగా...

Health: అదే పనిగా కాళ్లు ఆడిస్తున్నారా.? మీరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లే..
Legs
Follow us on

ఒక్కొక్కరి ఒక్కో ఒకరమైన అలవాటు ఉంటుంది. కొందరు నిత్యం గోళ్లను కొరుకుతుంటారు. మరికొందరు వేళ్లను విరుస్తుంటారు. ఇలాంటి వాటిలో ఒకటి.. నిత్యం కాళ్లను ఊపడం. మనలో చాలా మందికి ఇలాంటి అలవాటు ఉండే ఉంటుంది. ముఖ్యంగా కుర్చీలో కూర్చున్న సమయంలో కాళ్లను ఊపే వారు ఎక్కువగా ఉంటారు. కేవలం కూర్చున్న సమయంలోనే కాకుండా పడుకున్న సమయంలోనూ కాళ్లను ఆడించే వాళ్లు కూడా ఉంటారు. అయితే ఇలా కాళ్లను ఊపితే మంచిది కాదంటూ పెద్దలు హెచ్చరించే సందర్భాలు సైతం చూసే ఉంటాం.

అయితే ఇదంతా ఇలా ఉంటే.. ఇలా కాళ్లను ఊపడం కేవలం ఒక అలవాటు మాత్రమే కాదని, ఇది ఒక వ్యాధి అని మీలో ఎంత మందికి తెలుసు.? అవును మీరు చదివింది నిజమే. నిత్యం కాళ్లను ఆడిస్తుండడం కూడా ఒకరకమైన ఆరోగ్య సమస్యే అని నిపుణులు చెబుతున్నారు. ఇలా కాళ్లను నిత్యం ఆడించడాన్ని వైద్య పరిభాషలో రెస్ట్‌లెస్‌ లెగ్స్‌ సిండ్రోమ్‌గా అభివర్ణిస్తున్నారు. ఇది నాడీ వ్యవస్థకు సంబంధించిన సమస్యగా వైద్యులు చెబుతున్నారు. స్త్రీ, పురుషులనే తేడా లేకుండా అందరిలోనూ ఈ సమస్య కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ సిండ్రోమ్‌ నిద్రలేమి సమస్యలకు ముందస్తు లక్షణంగా చెబుతున్నారు. నిద్రలేమితో బాధపడే వారిలో ఇలాంటి లక్షణం కనిపిస్తుందని చెబుతున్నారు. అందుకే ఎక్కువ కాలం ఈ సమస్యతో బాధపడితే వెంటనే అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. అసలు కాళ్లు ఊపాలనే ఆలోచన ఎందుకు వస్తుందన్న దానిపై కూడా వైద్యులు ఓ లాజిక్ చెబుతున్నారు. దీని ప్రకారం.. రెస్ట్‌లెట్‌ గెల్స్‌ సిండ్రోమ్‌తో బాధపడే వారు కూర్చున్న సమయంలో కాళ్లలో ఆకస్మిక నొప్పి మొదలవుతుందని, ఈ సమయంలో కాళ్లను కదిలిస్తే నొప్పి నుంచి ఊపశనం లభిస్తుంది.

దీంతో వీరిలో ఇది ఒక అలవాటుగా మారిపోతుంది. దీనినే రెస్ట్ లెస్ లెగ్స్‌ సిండ్రోమ్‌ అంటారు. కాళ్లలో ఇలా నొప్పి రావడానికి ఐరన్ లోపం కారణం కావొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమ్యకు ఇదే ప్రధాన కారణమని చెప్పలేమంటున్న నిపుణులు.. కొన్ని సందర్భాల్లో జన్యుపరమైన సమస్యల వల్ల సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు. తల్లిదండ్రులకు ఈ సమస్య ఉంటే పిల్లల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీపీ, షుగర్‌, హార్ట్‌ సంబంధిత అనారోగ్యాలతో బాధపడే వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అయితే సమస్యకు చికిత్స కచ్చితంగా ఇదేనని చెప్పలేమని ఐరన్‌ లోపాన్ని తగ్గించుకోవడంతో పాటు ఫిజియో థెరపీ వంటి వాటి వల్ల ఈ సమస్యకు చెక్‌ పెట్టొచ్చని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యం విషయంలో ఎప్పుడైనా వైద్యుల సూచనలు పాటించడమే సూచించదగ్గ అంశం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..