
స్పష్టమైన మూత్రం శరీరానికి తగినంత నీరు అందుతోందని తెలియజేస్తుంది. కానీ మేఘంలా కనిపించే లేదా పాల వలె ఉండే మూత్రం డీహైడ్రేషన్, మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు (UTIలు), మూత్రపిండాల రాళ్లు వంటి సమస్యలను సూచించవచ్చు. మూత్రంలో నురుగుకు గల ప్రధాన కారణాలు, పరిష్కారాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శరీరంలో తగినంత నీరు లేకపోతే మూత్రం మరీ గాడిగా మారుతుంది. దీని వలన అది పసుపు రంగులోకి మారటమే కాకుండా నురుగు కూడా కనిపించవచ్చు. లక్షణాలు.. మూడి లేదా గాడి మూత్రం, తలనొప్పి, నోరు ఎండిపోవడం, అలసట. దీన్ని ఎలా నివారించాలంటే..? రోజుకు కనీసం 2-3 లీటర్ల నీరు తాగండి. ఎక్కువ ఉప్పు, కాఫీ, టీ తీసుకోవడం తగ్గించండి. చెమట ఎక్కువగా వచ్చే వేళల్లో నీరు అధికంగా తీసుకోండి.
బాక్టీరియా మూత్ర మార్గంలోకి ప్రవేశిస్తే UTI ఏర్పడుతుంది. దీని వలన మూత్రంలో తెల్లరక్త కణాలు చేరి మేఘంలా మారుతుంది. లక్షణాలు.. మూత్రవిసర్జన సమయంలో మంట, తరచుగా మూత్రం పోవాలనిపించడం, దుర్వాసన కలిగిన మూత్రం, కడుపు లేదా వీపు భాగంలో నొప్పి. దీన్ని ఎలా నివారించాలంటే..? ఎక్కువ నీరు తాగి, బాక్టీరియాను బయటికి పంపండి. వేడి నీటితో స్నానం చేయండి, పరిశుభ్రత పాటించండి. విటమిన్ C ఎక్కువగా ఉండే ఫలాలు తీసుకోవడం ద్వారా UTI వచ్చే అవకాశాలను తగ్గించవచ్చు.
మూత్రంలో అధిక ప్రోటీన్ ఉండటం మూత్రాన్ని మేఘంలా మారుస్తుంది. ఇది మూత్రపిండాల సమస్యలకు సంకేతంగా ఉండొచ్చు. లక్షణాలు.. చేతులు, కాళ్లు వాచిపోవడం, అలసట, దాహం, అధిక రక్తపోటు, మూత్రంలో నురుగు. దీన్ని ఎలా నివారించాలంటే..? ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం తగ్గించండి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం (చికెన్, గుడ్లు, మాంసం) తగ్గించండి. కిడ్నీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారం తీసుకోండి.
కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు మూత్ర మార్గంలో దురద, ఇన్ఫెక్షన్ వంటివి ఏర్పడతాయి. దీని వలన మూత్రం మేఘంలా మారటమే కాకుండా నొప్పి కూడా రావచ్చు. లక్షణాలు.. మూత్ర విసర్జన సమయంలో నొప్పి, వెన్ను లేదా కడుపు భాగంలో నొప్పి, పసుపు లేదా గులాబీ రంగులో మూత్రం. దీన్ని ఎలా నివారించాలంటే..? నీరు అధికంగా తాగండి, ముఖ్యంగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు మంచివి. ఉప్పు, ప్రాసెస్డ్ ఫుడ్, మాంసాహారం తగ్గించండి. డాక్టర్ సూచించిన పరీక్షలు చేయించుకోండి.
క్లామిడియా, గోనోరియా వంటి లైంగికంగా సంక్రమించే కొన్ని వ్యాధులు మూత్రాన్ని మేఘంలా మారుస్తాయి. లక్షణాలు.. మూత్ర విసర్జన సమయంలో మంట, అసాధారణ స్రావం, దుర్వాసన కలిగిన మూత్రం, లైంగిక కలయిక సమయంలో నొప్పి. దీన్ని ఎలా నివారించాలంటే..? సంరక్షిత లైంగిక సంబంధాలు కలిగి ఉండండి. ఏమైనా అనుమానాస్పద లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించండి. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి.
కొన్ని మందుల వల్ల మూత్రం రంగు మారవచ్చు లేదా మేఘంలా కనిపించవచ్చు. లక్షణాలు.. మూత్రం గులాబీ, లేత నారింజ, గాఢమైన పసుపు రంగులో కనిపించడం, తరచుగా మూత్రం పోవడం, నీరు తాగినా డీహైడ్రేషన్ లాంటి అనుభూతి. దీన్ని ఎలా నివారించాలంటే..? డాక్టర్ సూచనల మేరకు మాత్రమే మందులు వాడండి. ఏదైనా అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
మూత్రంలో మార్పులను చిన్న విషయంగా తీసుకోవద్దు. ఒకటి లేదా రెండు రోజుల పాటు మీ మూత్రంలో నురుగు, రంగు మార్పులు గమనిస్తే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. సరైన పోషకాహారం, తగినంత నీరు తీసుకోవడం, పరిశుభ్రత పాటించడం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)