Health News: ఆధునికి జీవనశైలి వల్ల ప్రతి ఒక్కరిలో బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. దీనివల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీపీ ట్యాబ్లెట్స్ వాడకుండా బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవాలి. కాబట్టి వయస్సు ప్రకారం స్త్రీలు, పురుషుల బీపీ ఎంత రేంజ్‌లో ఉండాలో తెలుసుకుందాం. అధిక రక్తపోటు సమస్య మహిళల కంటే పురుషులకు ఎక్కువగా వస్తుందని చెబుతారు. ఎవరైనా తలతిరిగి పడిపోయినప్పుడు మొదటగా బీపీ చెక్ చేస్తారు. తక్కువ బీపీ ఉన్నవారు మైకం వచ్చి తరచుగా పడిపోతారు. అలాగే ఛాతీ నొప్పి కూడా బీపీకి సంబంధించి ఒక లక్షణమే. మీడియా కథనాల ప్రకారం.. వయస్సును బట్టి బీపీలో మార్పు ఉంటుంది. పురుషుల వయస్సు ప్రకారం, రక్తపోటు 120 నుంచి 143 కి చేరుకుంటుంది. 21 నుంచి 25 సంవత్సరాల వయస్సులో SBP 120.5 mm ఉండాలి. 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు 115 వరకు ఉండాలి. ఇది కాకుండా 56 నుంచి 61 వరకు 143 వరకు ఉండాలి. మహిళల వయస్సు ప్రకారం.. 21 నుంచి 25 సంవత్సరాల వయస్సులో SBP 115.5 mm ఉండాలి, 26 నుంచి 50 సంవత్సరాలలో BP 124 కి చేరుకుంటుంది. ఇది కాకుండా 51 నుంచి 61 సంవత్సరాల వరకు బీపీ 130 వరకు ఉండాలి.
గుండె నుంచి రక్తం ఒక వేగంతో ప్రవహిస్తుంది. దీన్నే బ్లడ్ ప్రెషర్ అంటారు. దీన్ని బట్టే గుండె వేగం, శ్వాస, శరీర ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది. బీపీని సిస్టోలిక్, డయాస్టోలిక్ బీపీగా కొలుస్తారు. సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటే గరిష్ట సంఖ్య, గుండె కండరాలు రక్తాన్ని పంప్ చేస్తాయి. డయాస్టోలిక్ ప్రెషర్ అంటే కనిష్ట సంఖ్య. ఈ దశలో గుండె కండరాలు రిలాక్స్ అవుతూ ఉంటాయి. గుండె ముడుచుకున్నప్పుడు బీపీ ఎక్కువగా ఉంటుంది. అదే రిలాక్స్ అవుతున్నప్పుడు బీపీ తక్కువగా ఉంటుంది. సిస్టోలిక్ బీపీ ఒక సాధారణ ఆరోగ్యవంతుడైన వ్యక్తిలో 90 నుంచి 120 ఉండాలి. అదే డయాస్టోలిక్ బీపీ 60- 80 మధ్యలో ఉంటే సరిపోతుంది.
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.