World Psoriasis Day: చర్మంపై దురద, ఎర్రని దద్దుర్లు కనిపిస్తున్నాయా? వెంటనే అలర్ట్‌ అవ్వలేదంటే చిక్కులు తప్పవు

|

Oct 29, 2024 | 1:21 PM

కొన్ని సందర్భాల్లో చర్మంపై విపరీతమైన దురద వచ్చి, పొక్కులు ఏర్పడుతుంటాయి. ఇది మామూలేనని చాలా మంది అనుకుంటారు. కానీ దీనిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో భయంకరమైన చర్మ వ్యాధిగా మారే అవకాశం ఉంది. అదే సోరియాసిస్. ఇది ఒక్కసారి వస్తే అంత త్వరగా తగ్గదు..

World Psoriasis Day: చర్మంపై దురద, ఎర్రని దద్దుర్లు కనిపిస్తున్నాయా? వెంటనే అలర్ట్‌ అవ్వలేదంటే చిక్కులు తప్పవు
Psoriasis
Follow us on

సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక చర్మ వ్యాధి. మన దేశంలో లక్షలాది మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. చాలా మంది దీనిని సాధారణ వ్యాధిగా భావిస్తారు. అందుకే పెద్దగా పట్టించుకోరు. అయితే ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వచ్చే చర్మవ్యాధి అని చాలా మందికి తెలియదు. సోరియాసిస్ ప్రాణాంతకం కాదు. కానీ ఇది మన మానసిక ప్రశాంతతను పాడు చేస్తుంది. సాధారణంగా మన శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ బలహీనపడి వ్యాధి కణాలపై దాడి చేసినప్పుడు సోరియాసిస్ వ్యాధి వస్తుంది. అయితే చాలా మంది సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ వ్యాధి బారీన పడుతున్నారు. దీనిపై ప్రజలను అప్రమత్తం చేయడానికి, అవగాహన కల్పించడానికి ప్రతీయేట అక్టోబర్‌ 29వ తేదీని ప్రపంచ సోరియాసిస్‌ డేగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలకు సోరియాసిస్‌ చర్మ వ్యాధి గురించి దేశ వ్యాప్తంగా పలువురు నిపుణులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

సోరియాసిస్‌ లక్షణాలు

సోరియాసిస్‌ వచ్చిన వారి చర్మంపై దురదతో కూడిన ఎర్రటి పొక్కులు చర్మంపై కనిపిస్తాయి. సోరియాసిస్‌ వచ్చినప్పుడు మొదట చర్మం ఎర్రబడుతుంది. దీని కారణంగా చర్మంపై పొర ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. సాధారణంగా ఈ లక్షణాలు చల్లని వాతావరణంలో ఎక్కువగా కనిపిస్తాయి. ఇది కొత్త కణాలు నిరంతరం ఉత్పత్తి చేయబడటం వలన కాలక్రమేణా ఆరోగ్యకరమైన చర్మాన్ని ఇది పూర్తిగా పాడు చేస్తుంది. సుమారు ఒక నెల రోజుల్లో దీని కణాలు చర్మంపై పేరుకుపోతాయి. ఈ రకమైన శరీర పొరను ఏర్పరిచే కణాలు క్రమంగా నిర్జీవంగా మారి, అంతర్లీన కణాలను కొత్త చర్మాన్ని ఏర్పరచకుండా నిరోధిస్తుంది. ఈ వ్యాధి జన్యుపరమైన కారణాల వల్ల లేదా మానసిక ఒత్తిడి వల్ల వస్తుంది. ఫలితంగా శరీరంలోని రోగనిరోధక వ్యవస్థలో అసమతుల్యత ఏర్పడుతుంది. అంతేకాకుండా పలు రకాల మందులను దీర్ఘకాలికంగా ఉపయోగించడం వల్ల కూడా సోరియాసిస్ వస్తుంది.

ఇవి కూడా చదవండి

లక్షణాలు

  • దురద
  • చిన్న బొబ్బలు (చీముతో నిండిన బొబ్బలు)
  • గోర్లు కింద రంగు మారడం
  • పెళుసుగా లేదా కఠినమైన గోర్లు
  • వాపు లేదా కీళ్ళ నొప్పులు
  • పొడి, పగిలిన చర్మం లేదా మచ్చలు
  • కీటకాల కాటు లేదా తీవ్రమైన వడదెబ్బ కారణంగా చర్మ సమస్యలు రావడం
  • స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోక్‌
  • అధిక మద్యం వినియోగం

సోరియాసిస్‌కు చికిత్స

  • క్రీమ్‌లు లేదా లేపనాలు
  • ట్యాబ్లెట్స్‌, ఇంజెక్షన్లు లేదా లైట్ థెరపీ
  • మాయిశ్చరైజర్లు
  • చర్మ కణాల ఉత్పత్తిని మందగించే మందులు
  • విటమిన్ D3 లేపనం
  • విటమిన్ ఎ లేదా రెటినోయిడ్ క్రీములు

మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం క్లిక్‌ చేయండి.