Oral Cancer: నోటి క్యాన్సర్ రావొద్దంటే ఏం చేయాలి? నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు!

| Edited By: Janardhan Veluru

Mar 24, 2023 | 12:24 PM

మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో మనం ఎంత అప్రమత్తంగా ఉంటామో, అలాగే మన నోరు దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వందలాది వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు.

Oral Cancer: నోటి క్యాన్సర్ రావొద్దంటే ఏం చేయాలి? నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు!
Oral Cancer
Follow us on

మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడంలో మనం ఎంత అప్రమత్తంగా ఉంటామో, అలాగే మన నోరు దంతాలను ఆరోగ్యంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరం. నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా వందలాది వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు. దీన్నే ఓరల్ హైజీన్ అంటారు. రోజూ పళ్ళు తోముకోవడంతో సరిపోదు, మీ నోటి పరిశుభ్రతను కాపాడుకోవడానికి, సరిగ్గా బ్రష్ చేయడంతో పాటుగా ఫ్లాసింగ్, ఇంటర్‌డెంటల్ బ్రషింగ్ నాలుకను శుభ్రపరచడం కూడా అవసరం. ఇది మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, వాటిని సపోర్ట్ చేసే చిగుళ్లు, దవడ కణజాలాలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

నేటికీ, మన దేశంలో అధిక జనాభా తమ దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోవడంలో శ్రద్ధ చూపించరు. రాత్రి పూట దంతాలను శుభ్రం చేసుకోకుండానే పడుకుంటారు. ఇలాంటి అపరిశుభ్ర అలవాట్లు దంత క్షయం వంటి దంత సమస్యలకు దారితీస్తాయి. ఇవి కావిటీస్, పెరియాపికల్ ఇన్ఫెక్షన్, నాన్-విటల్ టూత్ లాస్‌కి దారితీస్తుంది. ఇది కాకుండా, దంతాలు పూర్తిగా చెడిపోతే, అది ఓరల్ క్యాన్సర్‌గా కూడా మారే ప్రమాదం ఉంది.

దంతాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల నోటి క్యాన్సర్ వస్తుంది:

ఇవి కూడా చదవండి

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. దంత ఇన్ఫెక్షన్ కారణంగా, దంతాలు పుచ్చిపోయే ప్రమాదం ఉంది. విరిగిన పళ్ళు నోటిలో చికాకును కలిగిస్తాయి. ఇదే ఓరల్ క్యాన్సర్‌కు కూడా కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. హెలికోబాక్టర్ పైలోరీ, పోర్ఫిరోమోనాస్ గింగివాలిస్ వంటి కొన్ని బ్యాక్టీరియాలు నోటిలోని ఎపిథీలియం పొరను ధ్వంసం చేస్తాయి. అవి అనేక క్యాన్సర్‌లకు కారణం అయ్యే ప్రమాదం ఉంది.

పొగాకు, ఆల్కహాల్ తీసుకునే వారి నోటిలో కొన్ని రకాల బ్యాక్టీరియా జాతులు నైట్రేట్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఇవి అసిటాల్డిహైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి, ఇవి క్యాన్సర్‌కు కారణమయ్యే మెటాబోలైట్‌లుగా మారుతాయి. సిగరెట్, బీడీ, గుట్కా నమలడం సహా అన్ని రకాల పొగాకు ఉత్పత్తులు నోటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. నోటిలో చిగుళ్ల వాపు, దంతాల మీద టార్టార్, దవడ ఎముక క్షీణించడం, నోటి లోపల తెల్లటి పాచెస్, చిగుళ్ల వ్యాధి, అలాగే నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెంచుతుంది.

అలాగే, గుట్కాను నమలడం, సుపారీ నమలడం వంటివి నోటిలో ఫైబ్రోబ్లాస్ట్ మార్పులకు దారితీస్తుంది ఇది నోటిలో ఫంగల్ పెరుగుదలకు దారితీసి, దంత చిగుళ్ల ఆరోగ్యం సరిగా లేని వ్యక్తులు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది నోటి గొంతు ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

నోటి క్యాన్సర్ వెనుక కారణాలు:

ముంబైలోని గ్లోబల్ హాస్పిటల్‌లో వైద్య, ఆంకాలజీ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ కన్సల్టెంట్ డాక్టర్ అక్షయ్ షా మాట్లాడుతూ, “భారత ఉపఖండంలో ఓరల్ స్క్వామస్ సెల్ కార్సినోమా (OSCC) అనేది పొగాకు, ఆల్కహాల్ ద్వారా వచ్చే నోటి క్యాన్సర్‌లలో ఒకటి. నోటి క్యాన్సర్‌కు దారితీసే సహాయక కారణాలు అనేకం ఉన్నాయి. మైక్రోబయోటా, పీరియాంటైటిస్, పోర్ఫిరోమోనాస్ గింగివాలిస్, పొగాకు ద్వారా నైట్రేట్‌ల నుండి నైట్రోసమైన్‌లు ఏర్పడటం, ఆల్కహాల్‌ల నుండి ఎసిటాల్డిహైడ్ ఏర్పడటం వంటివి నోటి క్యాన్సర్ వ్యాధికారక ఉత్పత్తికి కారణమయ్యే కారకాలు. అందువల్ల నోటి క్యాన్సర్ రాకుండా ఉండాలంటే నోటి శుభ్రతతో పాటు పొగాకు, ఆల్కహాల్ ఉత్పత్తులకు దూరంగా ఉండాల్సిందే.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం