చలికాలం ఓక్యులర్ మైగ్రేన్‌తో జాగ్రత్త.. వ్యాధి లక్షణాలు, కారణాలు తెలుసుకోండి..?

|

Jan 28, 2022 | 12:34 PM

Ocular Migraine: మైగ్రేన్ అనేది నేటి కాలంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి. వినడానికి సాధారణంగా ఉన్నా చాలా సమస్యాత్మకమైనది. మైగ్రేన్‌ ఉన్న వ్యక్తులు చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు.

చలికాలం ఓక్యులర్ మైగ్రేన్‌తో జాగ్రత్త.. వ్యాధి లక్షణాలు, కారణాలు తెలుసుకోండి..?
Ocular Migraine
Follow us on

Ocular Migraine: మైగ్రేన్ అనేది నేటి కాలంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వ్యాధి. వినడానికి సాధారణంగా ఉన్నా చాలా సమస్యాత్మకమైనది. మైగ్రేన్‌ ఉన్న వ్యక్తులు చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. ఇందులో తీవ్రమైన తలనొప్పి, భయం ప్రధానంగా కనిపిస్తాయి. కానీ మీకు మైగ్రేన్‌తో పాటు దృష్టిలో ఏదైనా సమస్య ఉంటే అది ఓక్యులర్ మైగ్రేన్. అయితే ప్రజలు కంటి మైగ్రేన్ లక్షణాలు, రెటీనా మైగ్రేన్‌ లక్షణాలకు సంబంధించి గందరగోళానికి గురవుతారు. ఈ రెండు మైగ్రేన్‌లు ఒకేలా ఉండవు. కంటి మైగ్రేన్ సాధారణ మైగ్రేన్ కంటే భిన్నంగా ఉంటుంది. ఈ సమస్య అన్ని మైగ్రేన్ రోగులతో కనిపించదు. కానీ మీకు మైగ్రేన్‌ ఉన్నప్పుడు కంటి చూపులో ఏదైనా సమస్య ఉంటే అది కచ్చితంగా కంటి మైగ్రేన్ అని గుర్తుంచుకోండి.

కంటి మైగ్రేన్ లక్షణాలు..

మీరు కంటి మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లయితే పగటిపూట మీ కళ్ల ముందు చాలా వింతలను చూస్తారు. రోగి చాలాసార్లు బ్లైండ్‌ స్పాట్‌లను ఎదుర్కోవలసి రావచ్చు. దీని కారణంగా చూడటం కష్టం అవుతుంది. మీరు ప్రకాశవంతమైన కాంతితో ఇబ్బంది పడతారు. కంటి చూపు కూడా తగ్గుతుంది. ప్రస్తుత ఆధునిక కాలంలో కంటి మైగ్రేన్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనిని గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుంది. సకాలంలో గుర్తిస్తే చికిత్స చేయడం సులువవుతుంది. వ్యాధి ముదరక ముందే తగ్గించవచ్చు.

కంటి మైగ్రేన్ నొప్పిని ఏది తీవ్రతరం చేస్తుంది

మీరు సరైన నిద్ర లేకపోతే ప్రకాశవంతమైన, ఫ్లాష్ లైట్ కారణంగా మీ శరీరంలో ఎక్కువ హార్మోన్ల మార్పులు జరుగుతున్నట్లయితే కంటి మైగ్రేన్ తీవ్రతరమవుతుంది. మీకు మైగ్రేన్ లేదా కంటి మైగ్రేన్ మరిన్ని సమస్యలు ఉంటే సకాలంలో వైద్యుడిని సంప్రదించండి. లేదంటే అది మీ శరీరంలోని ఇతర భాగాలపై చెడు ప్రభావాన్ని చూపుతుందని గుర్తుంచుకోండి. మైగ్రేన్ లక్షణాలు కనిపిస్తే ఒక్కసారి కంటి మైగ్రేన్‌ కాదా అవునా చెక్ చేసుకుంటే మంచిది.

SSC JE Result 2019: SSC జూనియర్ ఇంజనీర్ ఫలితాలు విడుదల.. ఇలా తనిఖీ చేసుకోండి..?

NMMSS 2022: ఏడో తరగతి విద్యార్థులకు ఏటా రూ.12000.. చివరి తేదీ జనవరి 30..?

చలికాలంలో డెడ్‌ సెల్స్‌ని తొలగించడానికి ఈ 3 పదార్థాలు సూపర్.. తక్కువ ఖర్చుతో మెరిసే చర్మం..