AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి ఈ టైమ్ కి తినండి.. శరీరంలో జరిగే మ్యాజిక్ చూసి ఆశ్చర్యపోతారు..!

రాత్రి భోజనం చేసే సమయం మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల జీర్ణ సమస్యలు, అజీర్ణం, గ్యాస్, బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి. కానీ పడుకునే ముందు 2 నుంచి 3 గంటలకే భోజనం పూర్తి చేస్తే జీర్ణక్రియ మెరుగుపడి.. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.

ఆరోగ్యంగా ఉండాలంటే రాత్రి ఈ టైమ్ కి తినండి.. శరీరంలో జరిగే మ్యాజిక్ చూసి ఆశ్చర్యపోతారు..!
Eating Food
Prashanthi V
|

Updated on: Aug 25, 2025 | 10:04 PM

Share

మీరు రాత్రి భోజనాన్ని ముందుగానే పూర్తి చేయడం వల్ల మరుసటి రోజు ఉత్సాహంగా ఉండటమే కాకుండా.. రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించుకోవచ్చు. రాత్రి భోజనం సమయం మన ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. రాత్రి ఆలస్యంగా ముఖ్యంగా పడుకునే ముందు భోజనం చేస్తే జీర్ణ సమస్యలు, గ్యాస్, అజీర్ణం, బరువు పెరగడం వంటి ఇబ్బందులు వస్తాయి. శరీరం నిద్రలో విశ్రాంతి తీసుకోవాల్సింది పోయి.. ఆహారాన్ని జీర్ణం చేయడానికి కష్టపడాల్సి వస్తుంది. దీని వల్ల నిద్ర కూడా సరిగా పట్టదు.

సాయంత్రం త్వరగా భోజనం చేస్తే..

  • జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. రాత్రి భోజనాన్ని త్వరగా పూర్తి చేయడం వల్ల ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి తగిన సమయం దొరుకుతుంది. దీంతో మరుసటి రోజు ఉదయం మీరు తేలికగా ఉత్సాహంగా ఉంటారు.
  • రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది.. రాత్రి గడిచే కొద్దీ మన శరీరంలో ఇన్సులిన్ ప్రభావం తగ్గుతుంది. అందుకే రాత్రి భోజనం ముందుగా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఇది మధుమేహం ఉన్న వారికి లేదా వచ్చే అవకాశం ఉన్న వారికి చాలా మంచిది.
  • జీవక్రియకు మేలు.. రాత్రిపూట మన శరీరం ఆహారాన్ని జీర్ణం చేయడం కంటే.. శరీరంలోని కణాలను బాగు చేసుకునే పనిలో ఉంటుంది. ఈ ముఖ్యమైన ప్రక్రియ సక్రమంగా జరగాలంటే.. భోజనం త్వరగా పూర్తి చేయడం మంచిది.

ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రాత్రి 7 గంటలకే తినాలని లేదు. కానీ పడుకోవడానికి కనీసం 2 నుంచి 3 గంటల ముందు భోజనం పూర్తి చేయడం చాలా ముఖ్యం. ఈ చిన్న మార్పు మీ జీవనశైలిని మెరుగుపరచడానికి.. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా సహాయపడుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..