
మీకు కాళ్లు లాగుతున్నట్లు అనిపిస్తుందా..? కాలి మండ లేదా బొటన వేలు వద్ద విపరీతమైన నొప్పి ఉందా..? అడుగు తీసి అడుగు వేయాలంటే నరకం కనిపిస్తుందా..? వాపు కనిస్తుందా..? అయితే మీరు వెంటనే డాక్టర్ దగ్గరకి వెళ్లి.. యూరిక్ యాసిడ్ టెస్టులు చేయించాల్సిందే. యూరిక్ యాసిడ్ స్థాయులు పెరగడంతో చాలా సమస్యలు వెంటాడతాయి. ముఖ్యంగా కాళ్లతోపాటు చేతుల్లోని ఎముకల దగ్గర యూరిక్ ఆమ్లం తిష్ట వేస్తుంది. దాంతో విపరీతమైన కీళ్ల నొప్పులు వస్తుంటాయి. కాళ్లు, చేతులు వాచిపోవడంతోపాటు నొప్పులు కూడా వస్తుంటాయి. సాధారణంగా మర బాడీలో తయారయ్యే యూరిక్ యాసిడ్ యూరిన్ ద్వారా కిడ్నీలు బయటకు పంపిస్తాయి. అయితే, మూత్రపిండాల్లో ఏవైనా సమస్యలు లేదా మరేదైనా కారణం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగితే సమస్యలు చుట్టుముడతాయి.
కొన్నిసార్లు జన్యు పరంగా ఈ సమస్య ఉంటుంది. బరువు ఎక్కువైనా, అతిగా ఆల్కహాల్ తాగినా, అధిక రక్తపోటు, మూత్రపిండాల వ్యాధులు, షుగర్, బీపీ కారణంగా కూడా యూరిక్ ఆమ్లం స్థాయులు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీలో యూరిక్ ఆమ్లం స్థాయిలు ఎక్కువ ఉన్నట్లు తేలితే.. బరువు తగ్గించేందుకు ప్రయత్నించాలి. ఆల్కహాల్ తీసుకోవడం మానేస్తే బెటర్. అలానే స్మోకింగ్ కూడా మానెయ్యాలి. నీటిని ఎక్కువగా తాగుతూ హైడ్రేట్ అవ్వాలి. కీళ్లపై ఒత్తిడి పడకుండా వ్యాయామం చేయాలి. కాగా కీళ్ల నొప్పి ఉన్న ప్రాంతంలో.. 10 నిమిషాలపాటు ఐసు ముక్కలతో మర్దనా చేస్తే.. చాలావరకు రిలీఫ్ ఉంటుంది.
అలానే ఫుడ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పళ్లు, కూరగాయలు, నట్స్ లాంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. పంచదార, ఉప్పు సాధ్యమైనంత మేర తగ్గించాలి. ప్యూరిన్ స్థాయులు అధికంగా ఉండే.. మాంసం, చేపలు, పెరుగు, గుడ్లు, హోల్ గ్రెయిన్స్, పాలు, చీజ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. సమస్య వేధిస్తుంటే.. డాక్టర్ల వద్దకు వెళ్లి చికిత్స తీసుకోవాలి. సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే.. ఈ సమస్య మళ్లీ, మళ్లీ వెంటాడే అవకాశం ఉంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడం మేలు.