Weight Loss Tips: ఈ మూడు కీలక సూత్రాలు పాటిస్తే బరువు తగ్గవచ్చు.. ఆరోగ్య నిపుణుల సూచనలు..!

|

Sep 14, 2021 | 10:12 AM

Weight Loss Tips: ప్రస్తుతమున్న కాలంలో చాలా మంది బరువు అధికంగా పెరిగిపోతున్నారు. బరువును తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు...

Weight Loss Tips: ఈ మూడు కీలక సూత్రాలు పాటిస్తే బరువు తగ్గవచ్చు.. ఆరోగ్య నిపుణుల సూచనలు..!
Follow us on

Weight Loss Tips: ప్రస్తుతమున్న కాలంలో చాలా మంది బరువు అధికంగా పెరిగిపోతున్నారు. బరువును తగ్గించుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేసినా ఫలించడం లేదు. కొన్నింటిని పాటిస్తే సులభంగా బరువును తగ్గించుకోవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక బరువు తగ్గాలంటే ఆహార నియమాలు పాటించడంతో పాటు మెరుగైన జీవనశైలిని అలవర్చుకోవాలంటున్నారు. కేవలం తాత్కాలికంగా బరువు తగ్గడం మీద దృష్టి పెట్టకుండా, దీర్ఘకాలం తగ్గిన బరువును అదుపులో ఉంచుకోగలిగే ఆరోగ్యకరమైన జీవనశైలి మీదే దృష్టి పెట్టాలి. ఇందుకోసం తోడ్పడే మూడు కీలక ఆరోగ్య సూత్రాలు పాటించాలంటున్నారు నిపుణులు.

ఆహార నియమాలలో..

చాలా మందికి ఆహార నియమాలు అనేవి పాటించరు. బరువును తగ్గించుకునేందుకు సరైన మార్గాలను ఎంచుకుంటే మేలంటున్నారు. తీసుకునే పోషకాహారం ఓ ట్రెండ్‌ లేదా తాత్కాలిక ఫలితాన్నిచ్చే ఓ ఆయుధంలా కాకుండా దాన్ని జీవనశైలిగా మార్చుకోవాలి. ఆహారపు అలలవాట్లను సరిదిద్దుకుని, మైక్రో, మ్యాక్రో న్యూట్రియెంట్లతో కూడిన పోషకాహారాన్ని ఎంచుకోగలిగితే, కొవ్వును కరిగించుకోవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే ప్రతి రోజూ తీసుకోవాలి. అదే ఆహారాన్ని ప్రతి రోజూ తినాల్సివచ్చినా దారి తప్పకూడదు. అదే ఆహారాన్ని మసాలాలు, ఇతర పదార్థాలతో రుచిని పెంచుతూ ఆహార నియమాలకు కట్టుబడి ఉండాలి.

క్రమం తప్పకుండా వ్యాయామం:

ఒకేసారి భారీ వర్కవుట్‌ చేయలేకపోతే, తక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామాలను క్రమం తప్పకుండా ప్రతి రోజూ చేయడం ఎంతో మేలు. ఎవరికి వారు వారికి సూటయ్యే వ్యాయామాన్ని ఎంచుకోవాలి. కొందరికి జిమ్‌కి వెళ్లడం ఇష్టం ఉండకపోవచ్చు. అలాంటివాళ్లు జాగింగ్‌, రన్నింగ్‌ లేదా సైక్లింగ్‌ చేయడం ఎంచుకోవడం బెటర్‌. మరికొందరికి స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌, వెయిట్‌ లిఫ్టింగ్‌ నచ్చకపోతే.. ఎలాంటి వ్యాయామం ఎంచుకున్నా క్రమం తప్పకూడదు. ఫిట్‌నెస్‌, మెటబాలిజం.. ఈ రెండింటినీ వ్యాయామం ప్రభావితం చేస్తుంది. కేవలం క్యాలరీలను కరిగించడమే ధ్యేయంగా కాకుండా, శరీరాన్ని ఓ పాజిటివ్‌ స్ట్రెస్‌కు లోను చేయడం అలవాటు చేసుకోవడం మంచిదంటుటున్నారు.

సరైన నిద్ర..

కాగా, నిద్రకు మనం ఇచ్చే ప్రాధాన్యత చాలా తక్కువ. నిద్రను చాలా తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. శరీరం రికవర్‌ అవడానికి, బింజ్‌ ఈటింగ్‌ను ప్రభావితం చేసే కార్టిసాల్‌ హార్మోన్‌ సక్రమ పనితీరుకు కంటి నిండా నిద్ర అవసరం. శరీరం తనకు తాను ఆరోగ్య వ్యవస్థల్లోని పొరపాట్లను సరిదిద్దుకుని, ఒత్తిడిని తగ్గించుకునే వెసులుబాటు నిద్రలోనే పొందుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్రకు కొరత రానివ్వకూడదు. అలాగే పోషకాలు శరీరమంతటా ప్రసరించడానికి తోడ్పడే నీటి కొరత ఏర్పడకుండా చూసుకోవాలి. శరీరంలో నీరు నిల్వ ఉండిపోకుండా ఉండడానికీ, కలుషితాల విసర్జనకూ కూడా సరిపడా నీరు అవసరం. దాహార్తికీ ఆకలికీ మధ్య తేడా విషయంలో శరీరం అయోమయానికి లోనవుతూ ఉంటుంది. అందుకే అదనపు క్యాలరీలు శరీరంలోకి చేరుకోకుండా ఉండాలంటే దాహం వేసే లోపే నీళ్లు తాగుతూ ఉండాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

గమనిక: ఇందులోని అంశాలు ఆరోగ్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందిస్తున్నాము. కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించండి:

ఇవీ కూడా చదవండి: Ear Examination: శిశువుకు ఈ పరీక్షలు తప్పనిసరి.. అత్యాధునిక పరికరాలతో ఈ సమస్య గుర్తింపు..!

Fitness Tips: మీరు జిమ్‌కు వెళ్తున్నారా? ఫిట్‌నెస్‌ కోసం ఇలా చేస్తే ప్రాణాలకే ప్రమాదం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Sleep Aid Device: మీకు సరిగ్గా నిద్ర పట్టడం లేదా..? ఒత్తిడిని తగ్గించి నిద్రపుచ్చే పరికరం