Weight Loss: అధిక బరువుతో బాధపడుతున్నారా? ఈ 4 పదార్థాలను ఆహారంలో చేర్చితే బెస్ట్ రిజల్ట్స్..!

|

Dec 05, 2021 | 12:27 PM

సాధారణ పిండికి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇవి ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. బరువు తగ్గడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.

Weight Loss: అధిక బరువుతో బాధపడుతున్నారా? ఈ 4 పదార్థాలను ఆహారంలో చేర్చితే బెస్ట్ రిజల్ట్స్..!
Weight Loss Tips
Follow us on

Weight Loss Tips: రోటీ, పప్పు, కూరగాయలు మనం ప్రతిరోజు తినే ఆహారంలో భాగంగానే ఉన్నాయి. ఇందులో రోటీలు తినడానికి చాలామంది ఇష్టపడుతుంటాం. అయితే మిల్లెట్, మొక్కజొన్న రోటీ, పంజాబ్ నుంచి బీహార్ వరకు అనేక రకాల రోటీలు తయారు చేస్తారని మీకు తెలుసా? రోటీ తినడంలో ప్రతి ఒక్కరికి ఒక్కో రుచి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆహారంలో రోటీలను తీసుకుంటారు. అందుకే బరువు తగ్గడం విషయానికి వస్తే, ప్రజలు రోటీలను పక్కనపెడుతుంటారు.

రోటీని ఆహారం నుంచి ఒక్క సారి తొలగించడం అంత సులభం కాదనేది కూడా నిజం. అయితే మీరు మీ డిన్నర్ ప్లేట్‌లో చేర్చుకోగలిగే కొన్ని రోటీలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి బరువు తగ్గడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పిండిలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వాటి గురించి తెలుసుకుందాం-

జొన్న పిండి:
మీరు బరువు తగ్గాలనుకుంటే, జొన్న పిండిని ఆహారంలో చేర్చండి. ఎందుకంటే జొన్న పిండిలో గ్లూటెన్ రహితం. ఇది ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా లభిస్తుంది. జీర్ణవ్యవస్థ సరిగా లేని వారికి ఇది చాలా మేలు చేస్తుంది. ఈ పిండి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ ఉత్తమమైనది. ఈ పిండిని కలిపేటప్పుడు కొద్దిగా గోధుమ పిండిని కూడా జోడించవచ్చు.

రాగి పిండి:
రాగి పిండిలో గ్లూటెన్ ఫ్రీ, ఫైబర్, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. ఈ రోటీలను తినడం ద్వారా పొట్ట చాలాసేపటి వరకు నిండుగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది. వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

మిల్లెట్ పిండి:
మిల్లెట్ పిండిలో గ్లూటెన్ ఫ్రీ, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్ లాంటి ఇతర పోషకాలు ఈ పిండిలో పుష్కలంగా లభిస్తాయి. ఈ పిండి ప్రత్యేకత ఏమిటంటే, ఇది మిమ్మల్ని అతిగా తినకుండా కూడా నిరోధిస్తుంది. ఎందుకంటే ఈ పిండిని తిన్న తర్వాత, మీరు చాలా కాలం పాటు కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఈ రొట్టె తిన్న తర్వాత, దాహం కూడా ఎక్కువగా వేస్తుంది.

ఓట్స్ పిండి:
ఓట్స్ పిండి కూడా మన పొట్టను చాలా కాలం పాటు నిండుగా ఉంచుతుంది. ఈ పిండిలో కరిగే, కరగని ఫైబర్లు ఉంటాయి. ఇది గుండె జబ్బులను తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాదు మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది చాలా మేలు చేస్తుంది.

Also Read: Pain-Urinating: మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పిగా ఉందా? అయితే, ఇది ఆ వ్యాధి లక్షణమే.. తస్మాత్ జాగ్రత్త..!

Omicron Virus: భారత్‏లో ఒమిక్రాన్ టెన్షన్.. పిల్లల పై తీవ్ర ప్రభావం.. ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..