Weight Loss Tips: ఉరుకులు పరుగుల జీవితంలో చాలామంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఆహారపు అలవాట్లు ఎక్కువగా స్థూలకాయం బారిన పడేలా చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు కొన్ని పద్దతులు పాటించడంతోపాటు రోజూ వ్యాయమం లాంటివి చేస్తే బరువు తగ్గుతారు. అయితే.. ఆకుకూరలతో కూడా బరువు తగ్గొంచంటున్నారు వైద్య నిపుణులు. చలికాలం ఎక్కువగా లభించే కూరగాయలు, ఆకు కూరలతో ఊబకాయం సమస్యకు చెక్ పెట్టవచ్చు. అయితే.. ఎలాంటి ఆకు కూరలను తీసుకుంటే బరువు తగ్గుతారో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
మెంతికూర – కొంచెం చేదు రుచితో ఉండే మెంతి ఆకులను దాదాపు అందరూ ఇష్టపడతారు. బంగాళదుంపలతో లేదా క్యారెట్‌లతోపాటు పలు కూరగాయలతో మెంతికూర వండితే ఆ రుచే వేరు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో తక్కువ క్యాలరీపాటు యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. తాజా మెంతి ఆకులలో ఆస్కార్బిక్ ఆమ్లం, బీటా కెరోటిన్ ఉంటాయి. మెంతులు ఎక్కువగా తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది. ఇది బరువు తగ్గించడంలో, వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె, రక్తపోటుకు సంబంధించిన సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది.
ఆవకూర- చలికాలంలో చాలా మంది ఆవకూర తినడానికి ఇష్టపడతారు. ఇందులో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీంతోపాటు తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
ముల్లంగి ఆకులు – ముల్లంగి ఆకుల్లో పెద్ద మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉన్న ముల్లంగి ఆకులు జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయి. దీంతో బరువు తగ్గుతారు.
తోటకూర- తోటకూర శరీరంలో ఇన్సులిన్ స్థాయిని సమర్థవంతంగా తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీని వల్ల చాలా సేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కావున ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
Also Read: