AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

నేటి ఆధునిక కాలంలో బరువు తగ్గడం కోసం రకరకాల డైట్ ప్లాన్స్ ఫాలో అవుతూ ఉంటారు. తక్కువ సమయంలో రిజల్ట్ ఆశిస్తూ ఉంటారు చాలామంది. త్వరితగతిన ఫలితం ఇవ్వకపోతే.. ప్లాన్ మార్చి మరో డైట్ ప్లాన్ ఎంచుకుంటారు. అయితే అసలు బరువు..

Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..
Jaggery Juice
Amarnadh Daneti
|

Updated on: Nov 29, 2022 | 6:00 AM

Share

నేటి ఆధునిక కాలంలో బరువు తగ్గడం కోసం రకరకాల డైట్ ప్లాన్స్ ఫాలో అవుతూ ఉంటారు. తక్కువ సమయంలో రిజల్ట్ ఆశిస్తూ ఉంటారు చాలామంది. త్వరితగతిన ఫలితం ఇవ్వకపోతే.. ప్లాన్ మార్చి మరో డైట్ ప్లాన్ ఎంచుకుంటారు. అయితే అసలు బరువు తగ్గకపోవడానికి కారణం ఏమిటి.. డైట్ సరిగ్గా పాటిస్తున్నామా లేదా అనే ప్రాథమిక విషయాలను పట్టించుకోరు. కాని బరువు తగ్గడం అనేది పూర్తిగా వ్యక్తి యొక్క జీవనశైలి, తినే ఆహారం, శారీరక శ్రమపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో బరువు తగ్గడానికి చాలామంది నానా తంటాలు పడుతున్నారు. కానీ సరైన డైట్‌, వర్కవుట్స్‌ మాత్రం చేయడం లేదు. సులువుగా బరువు తగ్గాలని అనుకుంటే అది సాధ్యం కాదు. కచ్చితంగా ఎంతో కొంత శ్రమించాలి. దీనితో పాటు మంచి డిటాక్స్‌ వాటర్ కూడా తీసుకోవాలి. ఆయుర్వేదం ప్రకారం నిమ్మకాయ, బెల్లం కలిపిన పానీయం సులువుగా బరువు తగ్గిస్తుందని తేలింది. అది ఎలాగో తెలుసుకుందాం.

బెల్లం, నిమ్మ డిటాక్స్ డ్రింక్

దీని కోసం కొంచెం బెల్లం తీసుకోండి. దీన్ని నీటిలో వేసి మరగబెట్టండి. తర్వాత ఫిల్టర్ చేసి అందులో నిమ్మరసం కలపండి. అంతే చల్లారిన తర్వాత తాగాలి. ప్రతి రోజు ఇలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

ఆరోగ్య ప్రయోజనాలు

బెల్లంలో మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, ఖనిజాలు, సెలీనియం, మాంగనీస్, కాపర్‌, కాల్షియం వంటి పోషకాలు ఉంటాయి. ఇది అనేక వ్యాధులను నయం చేయడంలో సహాయపడుతుంది. జలుబు, ఫ్లూ సమస్యను నయం చేయడంలో కూడా తోడ్పడుతుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయి. బెల్లం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శరీరాన్ని శుభ్రపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

నిమ్మకాయలు..

ఇక నిమ్మకాయను వివిధ రకాల వంటలలో ఉపయోగిస్తారు. ఇందులో ఫోలేట్, కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్, మాంగనీస్, ప్రొటీన్, కాపర్ పుష్కలంగా ఉన్నాయి. అజీర్ణం, మొటిమలు, రాళ్లు, ఊబకాయం అనేక ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్స చేసే సామర్థ్యం నిమ్మకాయకు ఉంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో కేలరీలు చాలా తక్కువ. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో తోడ్పడుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..