AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: మూడు పదుల వయసు దాటిందా.. మీ డైట్ పై కొద్దిగా దృష్టి పెట్టండి..

ముప్పై ఏళ్లు వచ్చాయంటే శరీర పనితీరులో తేడా వస్తుంది. ఇమ్యూనిటీ తగ్గిపోవడం మొదలవుతుంది. బోన్స్‌ అరిగిపోవడం ప్రారంభమవుతుంది. ఇంకా చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే ముప్పై ఏళ్లు దాటిన వారు డైట్‌..

Health: మూడు పదుల వయసు దాటిందా.. మీ డైట్ పై కొద్దిగా దృష్టి పెట్టండి..
Eating Food
Amarnadh Daneti
|

Updated on: Nov 29, 2022 | 5:30 AM

Share

వయసు పెరిగే కొద్ది అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా వ్యక్తి యొక్క జీవనశైలి ఆధారంగా అతడి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. పౌష్టికాహారం తీసుకుంటూ.. సమయానికి తింటూ ఆహార నియమాలు పాటించేవారు ఆరోగ్యవంతులుగా ఉంటారు చాలామంది. ఎన్ని ఆహార నియమాలు పాటించినా కొన్నిసార్లు ఆరోగ్య సమస్యల బారిన పడుతుంటారు. అయితే చిన్నవయసులో తినాలనిపించే ప్రతిది లాంగిచేస్తారు. కాని వయస్సు పెరిగేకొద్ది ఆహార నియమాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ముప్పై ఏళ్లు వచ్చాయంటే శరీర పనితీరులో తేడా వస్తుంది. ఇమ్యూనిటీ తగ్గిపోవడం మొదలవుతుంది. బోన్స్‌ అరిగిపోవడం ప్రారంభమవుతుంది. ఇంకా చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే ముప్పై ఏళ్లు దాటిన వారు తమ డైట్‌ లో మార్పులు చేసుకోవల్సి ఉంటుంది. సాధారణ ఫుడ్ తీసుకుంటే హెల్త్‌ సమస్యలతో సతమతమవుతూ ఉండాలి. అదే ఆహారంలో ఈ 5 ఫుడ్స్‌ చేర్చుకుంటే సరిపడ పోషకాలు అందుతాయి. అంతేకాదు కోల్పోయిన ఫిట్‌నెస్‌ కూడా మళ్లీ సాధించవచ్చు. ఆ ఆహారాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందాం.

అవిసె గింజలు

ముప్పై ఏళ్లు దాటిన వారికి అవిసె గింజలు చాలా ముఖ్యం. ఇందులో లిగ్నాన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫైటోఈస్ట్రోజెన్‌లు. ఇందులో విటమిన్లు ఇ, కె, బి1, బి3, బి5 అలాగే ఖనిజాలు అధికంగా ఉంటాయి. అవిసె గింజల వినియోగం ఋతు చక్రాల సమయంలో నొప్పి, తిమ్మిరి వంటి లక్షణాలను తగ్గించడంలో కూడా సహాయపడుతాయి. మహిళలు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారం.

అశ్వగంధ

ఇవి కూడా చదవండి

అశ్వగంధ ఒక మూలిక. ఇందులో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్, ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడటానికి అద్భుతమైన యాంటీఆక్సిడెంట్‌ను తయారు చేస్తుంది. వయస్సుతో పాటు క్షీణించడం ప్రారంభించే పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను మెరుగుపరచడంలో అశ్వగంధ సహాయపడుతుంది.

బ్లూబెర్రీస్

బ్లూ బెర్రీస్‌లో పోషకాలు అధికంగా ఉంటాయి. అత్యధిక యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. పురుషులలో టెస్టోస్టెరాన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని కూడా నియంత్రిస్తుంది

స్పిరులినా

ఇందులో ఎ, ఇ, కె, బి1, బి2, బి3, బి6, బి9, బి5 అలాగే ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాల సహజ గుణాలు ఉంటాయి. ఈ విటమిన్లు సెల్యులార్ జీవక్రియ, అభివృద్ధి, రక్షణకు బాధ్యత వహిస్తుండగా ఒమేగా 3, 6 గుండె ఆరోగ్యానికి చాలా మంచివి.

జిన్సెంగ్

జిన్సెంగ్ యాంటీ-ట్యూమర్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. దీని మూలాలు లిబిడో స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. అలసటతో పోరాడటానికి, ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..