Weight Loss Drink: ఈ మసాలా డ్రింక్‌తో కొవ్వు వెన్నలా కరిగిపోతుంది.. బరువు కూడా ఈజీగా తగ్గొచ్చు..
వంటగదిలో ఉండే మసాల దినుసులతో ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు. అయితే.. బరువును తగ్గించుకోవడానికి 3 రకాల మసాలా దినుసుల పానీయాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
Weight Loss Drink: ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు, బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతన్నారు. అయితే.. బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. ఎందుకంటే చాలా మందికి జిమ్‌కి వెళ్లడానికి సమయం ఉండదు. అయితే.. అలాంటి వారు వర్కవుట్ చేయకుండానే బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు. వంటగదిలో ఉండే మసాల దినుసులతో ఊబకాయానికి చెక్ పెట్టవచ్చు. అయితే.. బరువును తగ్గించుకోవడానికి 3 రకాల మసాలా దినుసుల పానీయాలను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీని ద్వారా బరువు తగ్గడంతోపాటు.. బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుందని పేర్కొంటున్నారు ఆయుర్వేద నిపుణులు..
బరువు తగ్గాలంటే ఈ స్పెషల్ డ్రింక్స్ తాగండి..
జీలకర్ర, ఫెన్నెల్, కొత్తిమీర సహాయంతో బరువు తగ్గించే పానీయాన్ని సిద్ధం చేయవచ్చు. దీని కోసం ఒక గ్లాసు నీటిలో మూడు మసాలా దినుసులను ఒక చెంచా తీసుకొని రాత్రంతా నానబెట్టండి. ఉదయాన్నే తక్కువ మంటపై మరిగించి వడగట్టి తాగాలి. మీరు ఈ పానీయానికి నిమ్మ, నల్ల ఉప్పును జోడిస్తే.. దీని ప్రభావం మెరుగ్గా మారుతుంది.
సోంపు ప్రయోజనాలు..
సోంపు తినడం ద్వారా శరీరానికి ఖనిజాలు, విటమిన్లు బాగా అందుతాయి. ఇది వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. ఈ మసాలా దినుసులో మంచి మొత్తంలో ప్రోటీన్ లభిస్తుంది. ముఖ్యంగా ఒక టీస్పూన్ ఫెన్నెల్‌లో 20 కేలరీలు, 1 గ్రాము ప్రోటీన్, 3 గ్రాముల పిండి పదార్థాలు, 2 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇది జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. దీంతోపాటు బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.
ధనియాల ప్రయోజనాలు..
ధనియాల్లో క్రిమినాశక లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది శరీరం నుంచి అదనపు నీటిని తొలగించడంలో సహాయపడుతుంది. దీంతోపాటు ముఖంపై అద్భుతమైన గ్లోను కూడా తెస్తుంది. ధనియాలు రక్తంలో చక్కెర స్థాయిని, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. కొత్తిమీరలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కళ్ళకు చాలా మేలు చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంతోపాటు బరువును తగ్గిస్తుంది.
జీలకర్ర ప్రయోజనాలు..
జీలకర్ర యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇందులో కాల్షియం, కాపర్, ఐరన్, మాంగనీస్, జింక్, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి. దీంతోపాటు విటమిన్ ఎ, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి మరియు విటమిన్ ఇ కూడా పుష్కలంగా ఉన్నాయి. జీలకర్ర తినడం వల్ల మెటబాలిజం మెరుగ్గా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గడానికి ఇదే కారణం.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Read: