Watching TV: మీరు రోజు టీవీ ఎంతసేపు చూస్తారు.. అయితే మీకు ఆ సమస్య వచ్చినట్లే..!

|

May 27, 2022 | 1:47 PM

Watching TV: మీరు రోజు గంటల తరబడి టీవి చూస్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. టీవీ ముందు ఎక్కువ సమయం గడిపేవారికి గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు ఒక పరిశోధనలో తేలింది.

Watching TV: మీరు రోజు టీవీ ఎంతసేపు చూస్తారు.. అయితే మీకు ఆ సమస్య వచ్చినట్లే..!
Watching Tv
Follow us on

Watching TV: మీరు రోజు గంటల తరబడి టీవి చూస్తున్నారా.. అయితే ఈ వార్త మీ కోసమే. టీవీ ముందు ఎక్కువ సమయం గడిపేవారికి గుండె వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు ఒక పరిశోధనలో తేలింది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, హాంకాంగ్ యూనివర్సిటీకి చెందిన నిపుణుల బృందం దీనిపై అధ్యయనం నిర్వహించింది. ఇందులో ప్రతిరోజూ ఒక గంట కంటే తక్కువ సమయం టీవీ చూడటం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని 11 శాతం వరకు తగ్గించవచ్చని తేల్చింది.

అలాగే రోజుకు 4 గంటల కంటే ఎక్కువసేపు టీవీ చూసే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉందని వారు వెల్లడించారు. రోజుకు 2-3 గంటలు టీవీ చూసే వ్యక్తులలో గుండె జబ్బులు వచ్చే అవకాశం 6 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం కోసం నిర్వాహకులు 5లక్షల కంటే ఎక్కువ మంది వ్యక్తుల నుంచి పాలిజెనిక్ రిస్క్ స్కోర్‌లను సేకరించారు. శారీరకంగా చురుకుగా ఉండటానికి బదులుగా ఎక్కువసేపు కూర్చోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని వారు చెబుతున్నారు.

టీవీ చూడటం లేదా కంప్యూటర్‌ను ఉపయోగించడం వల్ల చాలామంది ఒక దగ్గర గంటల తరబడి కూర్చుంటారు. దీనివల్ల గుండె పనితీరు ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. వాస్తవానికి కదలకుండా ఒకే దగ్గర కూర్చొని పనిచేయడం శరీరానికి అంత మంచిది కాదు. కనీసం అర్దగంటకి ఒకసారైనా శరీరంలో కదలికలు ఉండాలి. లేదంటే ధీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి