Walking: రాత్రి భోజనం చేసిన తర్వాత 10 నిమిషాల వాకింగ్.. ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

| Edited By: Ravi Kiran

Aug 29, 2022 | 7:32 AM

Walking Benefits: రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల శరీరంలో గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఉబ్బరం, మలబద్ధకం, తదితర ఉదర సంబంధిత సమస్యల దూరం చేస్తాయట.

Walking: రాత్రి భోజనం చేసిన తర్వాత 10 నిమిషాల వాకింగ్.. ఎలాంటి ప్రయోజనాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Walking Benefits
Follow us on

Walking Benefits: రాత్రి భోజనం చేసిన వెంటనే పడుకునే బదులు దాదాపు 10 నిమిషాల పాటు నడవడం వల్ల పలు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకుని మొబైల్ ఫోన్‌ను చూడటం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట. రోజంతా సమయం లేకపోయినా, రాత్రి భోజనం చేసిన తర్వాత కనీసం 10 నిమిషాలు నడకకు కేటాయించాలి. శరీరం చురుగ్గా ఉండాలన్నా, మనసు ప్రశాంతంగా ఉండాలన్నా ఈ వాకింగ్‌ హ్యాబిట్‌ను అలవర్చుకోవాలంటున్నారు నిపుణులు. రాత్రి భోజనం తర్వాత నడవడం వల్ల శరీరంలో గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే ఉబ్బరం, మలబద్ధకం, తదితర ఉదర సంబంధిత సమస్యల దూరం చేస్తాయట.

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, భోజనం తర్వాత 10 నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. నిజానికి, భోజనం తర్వాత 30 నిమిషాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం ప్రారంభమవుతుంది. కానీ శరీరం నడక ద్వారా గ్లూకోజ్‌ని ఉపయోగిస్తుంది. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. భోజనం తర్వాత నడవడం అనేది జీవక్రియను మెరుగుపరచడానికి సులభమైన మార్గాలలో ఒకటి. శరీరానికి ఎక్కువ కేలరీలు బర్న్ చేయడానికి నిద్ర సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి రాత్రి భోజనం తర్వాత వాకింగ్ తప్పనిసరి. మేయో క్లినిక్ అధ్యయనాల ప్రకారం.. నడక ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది శరీరంలో ఎండార్ఫిన్‌లను విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఇవి డిప్రెషన్, అలాగే నిద్రలేమి నుండి ఉపశమనం కలిగిస్తాయి. అదేవిధంగా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..