Healthy lemon-Coriander Soup: వర్షాకాలంలో వ్యాధులు రాకుండా కొత్తిమీర, నిమ్మరసంతో ఇలా సూప్ చేయండి!!

| Edited By: Ravi Kiran

Sep 11, 2023 | 6:30 AM

ప్రస్తుతం ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, జ్వరాలు. వైరల్ ఫీవర్స్ తో సతమతమవుతున్నారు జనం. నాలుగైదు రోజుల వరకూ నీరసం, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఎండ, వాన ఇలా వాతావరణం మారడంతో.. ఈ వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నారు. దీంతో ఎలాంటి వారైనా అనారోగ్యం చెందుతున్నారు. దీంతో ఫుడ్ తీసుకోలేకపోతారు. ఈ క్రమంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అలాంటి వారికి కొత్తిమీర-నిమ్మరసం సూప్ మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇది జ్వరంగా ఉన్నవాళ్లు తాగితే.. నోటికి రుచిగా, కాస్త ఉపశమనంగా..

Healthy lemon-Coriander Soup: వర్షాకాలంలో వ్యాధులు రాకుండా కొత్తిమీర, నిమ్మరసంతో ఇలా సూప్ చేయండి!!
Lemon Coriander Soup
Follow us on

ప్రస్తుతం ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, జ్వరాలు. వైరల్ ఫీవర్స్ తో సతమతమవుతున్నారు జనం. నాలుగైదు రోజుల వరకూ నీరసం, ఒళ్లు నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు. ఎండ, వాన ఇలా వాతావరణం మారడంతో.. ఈ వైరల్ ఫీవర్స్ ఎక్కువ అవుతున్నారు. దీంతో ఎలాంటి వారైనా అనారోగ్యం చెందుతున్నారు. దీంతో ఫుడ్ తీసుకోలేకపోతారు. ఈ క్రమంలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. అలాంటి వారికి కొత్తిమీర-నిమ్మరసం సూప్ మంచి ఎనర్జీని ఇస్తుంది. ఇది జ్వరంగా ఉన్నవాళ్లు తాగితే.. నోటికి రుచిగా, కాస్త ఉపశమనంగా ఉంటుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ సూప్ అని చెప్పవచ్చు. మరి ఈ లెమన్-కొరియాండర్ సూప్ ను ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ సూప్ కు కావాల్సిన పదార్థాలు:

తరిగిన కొత్తిమీర – ఒక కట్ట, నిమ్మరసం – ఒకటిన్నర చక్క, తెల్ల మిరియాల పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – 500 ఎమ్ ఎల్, ఎరోమాటిక్ పౌడర్ – ఒక టీ స్పూన్.

ఇవి కూడా చదవండి

లెమన్ – కొరియాండర్ సూప్ ఎలా తయారు చేసుకోవాలి:

ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఇవి వేడయ్యాక.. తెల్ల మిరియాల పొడి, ఎరోమాటిక్ పౌడర్, ఉప్పు వేసుకుని మరికాసేపు మరిగించాలి. నీళ్లు మరిగాక.. పలుచగా కలుపుకున్న కార్న్ ఫ్లోర్ నీటిని పోసి కలుపుకోవాలి. దీన్ని మరో రెండు నిమిషాలు మరిగించిన తర్వాత.. కొత్తిమీర వేసి కలుపుకోవాలి. నెక్ట్స్ నిమ్మరసం వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే లెమన్-కొరియాండర్ సూపర్ రెడీ. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా ఇంట్లోనే సింపుల్ గా ఈ సూప్ చేసుకుని తాగితే.. మంచి రిలీఫ్ గా ఉంటుంది. అలాగే జ్వరం, జలుబు, దగ్గు ఉన్నవాళ్లు తాగితే ఇంకా బెటర్.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి