Diabetes in Kids: ప్రకృతికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతి లో లభించేవే మానవ మనుగడకు జీవనాధారం. సహజమైన ఆహారపదార్ధాలను తీసుకుంటూ.. శారీరక కష్టం చేసినంత వరకూ మనిషి రోగాల బారిన పడకుండానే ఉన్నాడు. ఎప్పుడైతే మనిషి జీవన విధానంలో మార్పులు వచ్చాయో.. అప్పటి నుంచి వయసుతో సంబంధం లేకుండా వ్యాధుల బారిన పడుతున్నాడు. కొంతకాలం వరకూ నిర్ణీత వయసు వచ్చిన తర్వాతే షుగర్ ( Diabetes ) , బీపీ(BP) వంటి వ్యాధులు వచ్చేవి.. కానీ గత కొంతకాలంగా చిన్న పిల్లలలో కూడా ఈ వ్యాధులు.. ముఖ్యంగా మధుమేహ వ్యాధి బాధితులుగా చిన్నారులు (Type-1 Diabetes in children)సైతం మారుతున్నారు. ఈ వ్యాధి పిల్లలను కూడా తన గుప్పిట్లోకి తీసుకుంటుండడంతో ఆందోళన కలిగిస్తోంది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలలో షుగర్ వ్యాధి కలగడానికి నిర్దిష్టమైన కారణం అంటూ ఏమీ లేదు. జీవనశైలి, తినే ఆహారం, జన్యుపరమైన కారణాలు పిల్లలలో షుగర్ వ్యాధి రావడానికి కారణమవచ్చు. చాలా మంది పిల్లలు, యుక్తవయస్కులు టైప్ -1 డయాబెటిస్ బారిన పడుతున్నారు. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తికి ఇబ్బంది ఏర్పడుతోందిని అంటున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిని (రక్తంలో చక్కెర స్థాయి) నియంత్రించే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తిని నిలిపివేస్తుంది.
మధుమేహం రకాలు: మధుమేహంలో రెండు రకాలున్నాయి. టైప్ 1 , టైప్ 2 ఉన్నాయి.. వీటిలో టైప్ 1 ప్రమాదకరంగా పరిగణించబడుతుంది. టైప్ 1 డయాబెటిస్ బాధితులు పలు సందర్భాల్లో ఇన్సులిన్ కూడా తీసుకోవాల్సి వస్తుంది. ఇన్సులిన్ తీసుకోవడం ఆపేస్తే.. ఆ వ్యక్తి త్వరగా మరణించే అవకాశం ఉంది. ఈరోజు చిన్న పిల్లలలో టైప్ 1 మధుమేహం లక్షణాలు ఏమిటి? నివారణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఈరోజు తెలుసుకుందాం..
పిల్లలలో టైప్ 1 మధుమేహం లక్షణాలు:
1. పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు టైప్-1 మధుమేహంతో బాధపడుతుంటే.. దీని ప్రభావం వారి శారీరక బరువుపై చూపిస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లల బరువు వేగంగా తగ్గుతారు. ఈ ఇటువంటి పరిస్థితి పిల్లలో కనిపిస్తే.. వెంటనే తల్లిదండ్రులు అప్రమత్తమవ్వాలి. వైద్యుడికి చూపించాలి.
2. టైప్-1 మధుమేహం ఉన్న రోగులు ఎక్కువ ఆకలితో ఉంటారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుదల కారణంగా, ఆకలి పెరగడం ప్రారంభమవుతుంది. రెండు రకాల మధుమేహంలోనూ ఈ లక్షణాలు కనిపిస్తుంది. ఎక్కువగా ఆహారం తిన్న తర్వాత జీర్ణం కావడానికి శరీరంలోని శక్తి వృథా అవుతుంది. అటువంటి పరిస్థితిలో.. పిల్లల్లో అనేక ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.
3. పిల్లలు టైప్-1 డయాబెటిస్‌తో బాధపడుతుంటే.. త్వరగా అలసిపోతారు. ఆహారం జీర్ణం కావడం నుంచి అనేక ఇతర సమస్యలతో ఇబ్బంది పడతారు.
4. టైప్-1 మధుమేహం ఉన్న రోగులు టైప్-2 మధుమేహం ఉన్న రోగికిలా అధికంగా దాహం వేస్తుంది. అయితే ఇలా ఆర్థికంగా నీరు తాగడం.. ప్రతి ఆరోగ్య సమస్యలో సర్వరోగ నివారిణి పాత్ర పోషిస్తున్నప్పటికీ.. ఈ టైప్-1 మధుమేహం రోగులకు మాత్రం హానిని కలిగిస్తుంది. తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సిన సమస్య మొదలవుతుంది.
అభం శుభం తెలియని వయసు, కోరినది తినాలనుకునే వయసులో మీ పిల్లలు టైప్-1 మధుమేహం వంటి వ్యాధి బారిన పడకుండా సురక్షితంగా ఉంచాలనుకుంటే.. ప్రతిరోజూ ఆకుపచ్చ కూరగాయలు, తక్కువ తీపి పండ్లను తినేలా చేయండి. అంతేకాదు పిల్లలు శారీరక శ్రమ చేసేలా రన్నింగ్, యోగా వంటి వ్యాయామాలను రోజూ చేసేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..