ఈ మధ్యకాలంలో చాలా మంది నడుము, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నారు. ఇరవై ఐదేళ్ల వయసులోనే నడుము నొప్పితో బాధపడుతున్నారు. గంటల తరబడి ఒకే రకంగా కంప్యూటర్స్ ముందు కూర్చోవడం… శారీరానికి సరైన శ్రమ కల్పించకపోవడం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి. అంతకాకుండా.. కొన్ని సందర్భాల్లో ఆహార పదార్థాల వలన కూడా ఈ నడుము నొప్పి సమస్య తీవ్రంగా బాధిస్తుంది. అయితే కొన్ని చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో కావడం వలన ఈ నడుము నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు . అవెంటో తెలుసుకుందామా.
ప్రస్తుతం చాలా మంది కంప్యూటర్స్ ముందు కూర్చోని వర్క్ చేస్తుంటరు. అలాంటి సమయంలో మీ పొజిషన్ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. కళ్ళకు , మానిటర్ కు మధ్య కనీసం 20 అంగుళాల దూరం ఉండాలి. మణికట్టు తిన్నగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మోతేతులు 90 డిగ్రీల యాంగిల్ లో ఉండేలా చూసుకోవాలి. కీబోర్డు, మౌస్ సమాన ఎత్తులో ఉంచుకోవాలి. అలాగే కంప్యూటర్ ముందు కూర్చుటప్పుడు వెన్నెముక నిటారుగా ఉండేలా చూసుకోవాలి.
అలాగే.. మడమల మీద బరువు పడేలా చూసుకోవాలి. నిటారుగా కాసేపు నిల్చోవాలి. శరీరబరువును ఒక కాలు నుంచి మరో కాలుకు మారుస్తూ ఉండాలి. ఉదయం లేవగానే చేతులు, కాళ్ళ కండరాలు బిగుసుపోయినట్టు ఉంటాయి. అయితే కొన్ని స్ట్రెచింగ్ చేసే వ్యాయమాలు చేయాలి. సాధారణంగా ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం, ఎక్కువ దూరం బైక్ డ్రైవ్ చేయడం, కారులో ప్రయాణించడం, వెన్నుకి దెబ్బ తగలడం, వెన్నుకి సంబంధించిన సమస్యల వల్ల కూడా నడుము నొప్పి వస్తుంటుంది. అలాగే వెన్నుపై అధిక ఒత్తిడి ఉన్నా ఈ సమస్య ఎదురవుతుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.
Sneha: సంక్రాంతి సంబరాల్లో హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..