ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం టాప్ 10 టిప్స్..! ఇవి ఫాలో అయ్యి చూడండి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి..!
ఆధునిక సాంకేతికత, మౌలిక సదుపాయాల అభివృద్ధి మన జీవితాన్ని సులభతరం చేసినప్పటికీ.. పర్యావరణంపై ముఖ్యంగా గాలి నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపాయి. గాలి నాణ్యతలో వచ్చిన పెను మార్పుల వల్ల శరీరంలో అతిముఖ్యమైన ఊపిరితిత్తులకు ఇబ్బంది కలిగే ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. ఈ సందర్భంగా మీ ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.

గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయట వ్యాయామం చేయవద్దు. వాకింగ్, జాగింగ్ లేదా శ్వాస వేగాన్ని పెంచే ఇతర వ్యాయామాలు చేయడం వల్ల గాలిలోని హానికరమైన కణాలు లోపలికి వెళ్లే అవకాశం ఉంది.
తగినంత నీరు తాగడం వల్ల మీ శరీరం నుండి విష పదార్థాలను బయటకు పంపించవచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి రోజు కనీసం 8 నుండి 10 గ్లాసుల నీరు తాగడం మంచిది.
గాలి కాలుష్యం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలను ఎదుర్కోవడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి మీ రోగనిరోధక శక్తిని పెంచడం. దీని కోసం విటమిన్ సి, విటమిన్ ఇ వంటి ముఖ్యమైన పోషకాలు బాగా ఎక్కువుగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మీ శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ ఆహారంలో పోషకాలు ఉండేలా చూసుకోండి.
మీరు ధూమపానం చేస్తుంటే వెంటనే మానేయాలి. ముఖ్యంగా కాలుష్యం ఎక్కువగా ఉండే నగరంలో నివసిస్తుంటే ఇది చాలా ముఖ్యం. సిగరెట్ తాగడం కంటే మీ ఊపిరితిత్తులకు హాని కలిగించేది మరొకటి ఉండదు. సిగరెట్లలోని హానికరమైన రసాయనాలు గాలిలోని హానికరమైన కణాలతో కలిసి మీ ఊపిరితిత్తులకు చాలా ఎక్కువ నష్టం కలిగిస్తాయి.
ప్రతి రోజు శ్వాస వ్యాయామాలు చేయడం ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కడుపుతో శ్వాసించడం, పెదవులను దగ్గరగా ఉంచి శ్వాసించడం వంటి వ్యాయామాలు చేయవచ్చు.
మీ ఊపిరితిత్తులను రక్షించుకోవడానికి స్పృహతో కూడిన ప్రయత్నం అవసరం. అధిక కాలుష్యం ఉన్నప్పుడు శ్రమతో కూడిన కార్యకలాపాలను నివారించడం, నీటిని పుష్కలంగా తీసుకోవడం, పోషకమైన ఆహారం తీసుకోవడం, ధూమపానం మానేయడం, శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా మీరు మీ శ్వాసకోశ ఆరోగ్యాన్ని, మొత్తం ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరచుకోవచ్చు.