ఆహారంతో పాటు సలాడ్ కూడా తీసుకోవాలని తరచుగా చాలా మంది న్యూట్రిషియన్లు చెబుతుంటారు. ఎందుకంటే.. సలాడ్ ను తీసుకోవడం వల్ల శరీరానికి బోలెడన్ని పోషకాలు అందుతాయి.. సాధారణంగా సలాడ్ లో దోసకాయ, ఉల్లిపాయలు, ముల్లంగి, క్యారెట్, కొత్తిమీర ఆకులు, నిమ్మరసం, నల్ల ఉప్పును ఉపయోగిస్తారు. అందుకే దాని కలయిక సూపర్ ఫుడ్ రూపం మాదిరిగా ఉంటుంది. అందుకే.. భోజనంలో సలాడ్ ను తప్పనిసరిగా తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. సలాడ్ తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చో ఇప్పుడు తెలుసుకోండి..
పోషకాహారం సమృద్ధిగా ఉంటుంది: విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, పొటాషియం వంటి అనేక పోషకాలు, విటమిన్లు సలాడ్‌లో కనిపిస్తాయి. ఈ మూలకాలు శారీరక అభివృద్ధికి, రక్తం స్వచ్ఛతకు, శరీర బలం, చర్మ రక్షణకు సహాయపడతాయి.
బరువు నియంత్రణ: సలాడ్ తక్కువ క్యాలరీలు, అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇది బరువు పెరగడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా ఆకలిని తగ్గించడంలో సహాయపడుతుంది.. ఆరోగ్యకరమైన బరువు నిర్వహణను ప్రోత్సహిస్తుంది.
మెరుగైన జీర్ణక్రియ: సలాడ్‌లో తగినంత మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మంచి జీర్ణక్రియను నిర్వహిస్తుంది. మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. గ్యాస్‌ను తొలగించడంతోపాటు కడుపు ఇన్ఫెక్షన్ అవకాశాలను తగ్గిస్తుంది.
రక్తపోటు నియంత్రణ: సలాడ్‌లో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఇది అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మెరుగైన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ముఖ్యంగా హృద్రోగులు ఎక్కువగా ఉన్న భారతదేశంలో, సలాడ్ తినడం వారికి ప్రయోజనకరంగా ఉంటుంది.
మానసిక ఆరోగ్యానికి మంచిది: సలాడ్‌లో ఉండే విటమిన్లు, మినరల్స్ మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. మానసిక ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ బి, మెగ్నీషియం ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..