Green Tea Side Effects: గ్రీన్ టీ మంచిదని అతిగా తాగేస్తున్నారా..? అయితే, మీకో హెచ్చరిక..!

|

Jul 16, 2022 | 1:38 PM

అందం, ఆరోగ్యం అందిస్తుందని భావిస్తున్న గ్రీన్ టీ అతిగా తాగడం వల్ల అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా గ్రీన్ టీ తాగడం వల్ల

Green Tea Side Effects: గ్రీన్ టీ మంచిదని అతిగా తాగేస్తున్నారా..? అయితే, మీకో హెచ్చరిక..!
గ్రీన్ టీ తాగండి: ఈ రోజుల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి గ్రీన్ టీ తాగుతున్నారు. రోజూ ఉదయం పరగడుపున గ్రీన్‌ టీ తాగితే పొట్టకి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి.
Follow us on

Green Tea Side Effects: గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలిసిందే. గ్రీన్‌ టీ అలవాటుతో త్వరగా ఎక్కువ బరువు తగ్గుతారని చాలా మంది నమ్మకం. ప్రస్తుత కాలంలో వేగంగా బరువు తగ్గించుకోవాలనే ఆశతో… ఎక్కువ మంది గ్రీన్‌ టీకే మొగ్గుచూపుతున్నారు. అయితే, అతిగా ఏది చేసినా అనర్థమేనంటున్నారు నిపుణులు. అలాంటి వారు ఇకపై జాగ్రత్త వహించక తప్పదు. ఎందుకంటే అతిగా గ్రీన్ టీ తాగడం వల్ల కూడా కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కొక తప్పదని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

అందం, ఆరోగ్యం అందిస్తుందని భావిస్తున్న గ్రీన్ టీ అతిగా తాగడం వల్ల అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అతిగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్ర లేమీ సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి గ్రీన్ టీని మితంగా తీసుకోవడం మంచిదంటున్నారు.

ముఖ్యంగా ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగడం వల్ల ఎసిడిటీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. కాబట్టి ఉదయాన్నే గ్రీన్ టీ తాగే ముందు ఏదైనా తింటే మంచిదని చెబుతున్నారు.. గ్రీన్ టీ లోని కెఫిన్ వల్ల తలనొప్పి, నీరసం, బద్ధకం, చిరాకు వంటివి కలుగుతాయి. గ్రీన్ టీ అధికంగా సేవించడం వల్ల తలనొప్పి, నీరసం, బద్ధకం, చిరాకు వంటివి కలుగుతాయని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ శరీరంలో ఐరన్ లోపం ఏర్పడుతుందని చెబుతున్నారు. క్రమంగా ఆకలిని తగ్గిస్తుంది. గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వల్ల అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందంటున్నారు. గ్రీన్ టీలోని కెఫిన్ మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీంతో రక్తప్రసరణపై ప్రభావం వల్ల అధిక రక్తపోటుకు గురయ్యే అవకాశం ఉంది. రోజుకు 2-3 కప్పుల గ్రీన్ టీ తాగవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని హెల్త్ టిప్స్  కోసం ఇక్కడ క్లిక్ చేయండి