Muskmelon for Health: శీతాకాలంలో ఖర్బూజతో కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కాదు.. ఆవేమిటంటే..

|

Jan 29, 2023 | 3:58 PM

ప్రస్తుత కాలంలో మనం అనుభవిస్తున్న ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ప్రధాన కారణం. ఇంకా పోషకాలను అందించే పండ్లను తినకపోవడం కూడా ప్రభావిత

Muskmelon for Health: శీతాకాలంలో ఖర్బూజతో కలిగే ప్రయోజనాలు అన్నీఇన్నీ కాదు.. ఆవేమిటంటే..
Health Benefits Of Muskmelon
Follow us on

ప్రస్తుత కాలంలో మనం అనుభవిస్తున్న ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ప్రధాన కారణం. ఇంకా పోషకాలను అందించే పండ్లను తినకపోవడం కూడా ప్రభావిత అంశమే. కొన్ని కొన్ని ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లేకపోయినప్పటికీ వాటిని నియంత్రించవచ్చు. అందుకోసం పోషకాలతో కూడిన సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. ఆ క్రమంలోనే పోషకాల కోసం పండ్లను కూడా తినాలి. ఇక అటువంటి పోషకాలను అందించే పండ్లలో ఖర్బూజ కూడా ఒకటి.  ఖర్బూజ పండులో అధిక పరిమాణంలో పోషకాలు లభిస్తాయి. తద్వారా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కాబట్టి దీనిని శీతాకాలంలో తినడం వల్ల శరీరానికి పోషకాలు లభించి ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  ఖర్బూజలో కేలరీలు, కొవ్వు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్ల తక్కువ పరిమాణంలో లభిస్తాయి.

అంతేకాకుండా ఖర్బూజలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది సులభంగా శరీర బరువును నియంత్రిస్తుంది. ఇందులో ఉండే ఈ విటమిన్ చర్మంపై ఆక్సీకరణ ఒత్తిడికి గురికాకుండా కాపాడుతుంది. కాబట్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు తప్పకుండా  ఖర్బూజ పండును తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఖర్బుజను తినడం వల్ల ఏ విధమైన ప్రయోజనాలను పొందవచ్చో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరోగ్యకరమైన జీర్ణక్రియ: ఖర్బూజ పండులో కరిగే ఫైబర్‌ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి దీనిని ప్రతి రోజూ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

ఇవి కూడా చదవండి

యాంటీ-ఆక్సిడెంట్స్‌: పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్లు ఖర్బూజ పండులో పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను తగ్గించి సెల్స్‌ డ్యామేజ్‌ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్లను తగ్గించడానికి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.

గుండె ఆరోగ్యం: ఖర్బూజ పండులో అధిక స్థాయిలో పొటాషియం, విటమిన్ సి లభిస్తాయి. కాబట్టి వీటిని ప్రతి రోజూ తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో ఉండే గుణాలు రక్తపోటును తగ్గించి.. రక్త హీనత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

రోగనిరోధక శక్తి: శీతాకాలంలో ఖర్బూజ పండును తినడం వల్ల విటమిన్ సి, రిబోఫ్లేవిన్స్‌ లభిస్తాయి. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించి రోగనిరోధక శక్తిని పెంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌ చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు సహాయపడతాయి.

మరిన్ని హెల్త్ న్యూస్ కోసం