
థైరాయిడ్ సమస్యలకు మందులు తప్ప మరే చికిత్స లేదు. థైరాయిడ్ హార్మోన్ స్రావం, పనితీరు మందుల ద్వారా నిర్వహించవచ్చు.. కానీ థైరాయిడ్ సంబంధిత సమస్యలన్నీ మందు వేసుకోవడం వల్ల వెంటనే మాయమైపోయే పరిస్థితి ఉండదు.. హైపోథైరాయిడిజం బరువు పెరగడం, హృదయ స్పందన రేటు మందగించడం, తీవ్ర అలసట, నిరాశకు కారణమైనప్పుడు.. మందులు చికిత్సకు సరిపోవు.. థైరాయిడ్ ఉన్న వారు జీవనశైలిలో కూడా చిన్న మార్పులు చేసుకోవాలి. థైరాయిడ్‌లో తినడం, త్రాగడానికి చాలా పరిమితులు లేనప్పటికీ.. థైరాయిడ్ రోగులు ప్రతిరోజూ కొన్ని ఆహారాలను తీసుకోవాలి.. ముఖ్యంగా కొన్ని పండ్లను తీసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్యను చాలా వరకు నియంత్రించవచ్చు..
బెర్రీలు: థైరాయిడ్ సమస్యలను నియంత్రించడంలో యాంటీ ఆక్సిడెంట్లు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. ఇది థైరాయిడ్ పనితీరును చురుకుగా ఉంచుతుంది. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, క్రాన్బెర్రీస్ వంటి పండ్లు శరీరంలోని యాంటీఆక్సిడెంట్ల లోపాన్ని తీర్చగలవు. ఇవి థైరాయిడ్ వల్ల అలసట, బరువు పెరగకుండా కూడా నివారిస్తాయి.
యాపిల్స్: యాపిల్స్‌లో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. యాపిల్ థైరాయిడ్ గ్రంధిని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షిస్తుంది. అలాగే మధుమేహం, కొలెస్ట్రాల్, ఊబకాయం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేస్తుంది.
అవకాడో: అవకాడోలో ఎన్నో పోషకాలు దాగున్నాయి. దీని వల్ల విటమిన్ కె, ఫోలేట్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ బి5, బి6, విటమిన్ ఇ వంటి పోషకాలు లభిస్తాయి. థైరాయిడ్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అవకాడోలు మంచిగా సహాయపడుతాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..