Cooking Oil: కొలెస్ట్రాల్ లేని బెస్ట్ వంట నూనె ఏది.. మంతెన ఏం చెప్పారంటే.. ?

|

Mar 06, 2023 | 6:45 PM

ఏ వంట నూనె మంచిది. నూనె మార్చినా గుండె జబ్బులు ఎందుకు తగ్గడం లేదు. దీని వెనుక ఉన్న అసలు విషయం ఏంటి..? ?

Cooking Oil: కొలెస్ట్రాల్ లేని బెస్ట్ వంట నూనె ఏది.. మంతెన ఏం చెప్పారంటే.. ?
Zero Cholesterol Oil
Follow us on

ఈ మధ్య గుండె జబ్బులు అనేది ఏ రకంగా ఉన్నాయో చూస్తున్నాం. లేత వయసు పిల్లలు, యుక్త వయసులో, యంగ్ ఏజ్‌లో ఉన్నవారిని సైతం హార్ట్ ఎటాక్స్  వెంటాడుతున్నాయి. అప్పటివరకు బానే ఉన్నవారు పిట్టల్లా రాలిపోతున్నారు. అర్థాంతరంగా ఎక్కువమంది చనిపోవడం కూడా చూస్తున్నాం. కొలెస్ట్రాల్ సమస్యలు పెరగడం కూడా ఇందుకు ఒక కారణం. అందుకే కొలెస్ట్రాల్ లేని నూనె వంటింట్లో ఇప్పుడు ఎంతో అవసరం. 40 ఏళ్ల ముందు ఆవ నూనె వాడేవారు. ఆ తర్వాతి కాలంలో వేరుశనగ వచ్చింది. ఒక నాలుగైదు ఏళ్ల నుంచి సన్ ఫ్లవర్ ఆయిల్ వాడేవాళ్లు సైతం పెరుగుతున్నారు. ఈ మధ్య రైస్ బ్రాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ కూడా వాడుతున్నారు కొందరు.

అయినా కానీ గుండె జబ్బులు తగ్గకపోగా… పెరిగాయి. అయితే డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు  ఏ బ్రాండ్ ఆయిల్ వాడినా సమస్యలు తప్పవని చెబుతున్నారు. అయితే ఏ ఆయిల్‌లోనూ కొలెస్ట్రాల్ ఉండదు కానీ… ఏ బ్రాండ్ ఆయిల్ వాడినా మనల్ని కొలెస్ట్రాల్ సమస్య వెంటాడుతుందని ఆయన మరో కొత్త విషయం చెప్పారు. మన శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగేందుకు ఆయిల్ సహకరిస్తుందని వెల్లడించారు. మన శరీరానికి ఎంత అవసరం ఉందో, అంత కొలెస్ట్రాల్‌ను లివర్ ఉత్పత్తి చేస్తుంది. మన శరీరానికి రోజుకు 20 గ్రాముల ఇన్ డైరెక్ట్ కొవ్వు కావాలి. అంటే గింజల రూపంలో లోపలికి వెళ్లేది. కానీ ఆయిల్ రూపంలో రోజుకు సగటున 60 గ్రాములు డైరెక్ట్ కొవ్వు లోపలికి వస్తుంది. దీంతో లివర్ ఎక్కువ మోతాదులో కొవ్వును తయారు చేసి… రక్త నాళాల్లోకి పంపుతుంది. అది పేరుకుపోయి.. రకరకాల అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది.

అందుకే ఆయిల్ బ్రాండ్స్ మార్చినా గుండె జబ్బుల సమస్యలు తగ్గడం లేదని మంతెన తెలిపారు. అందుకే ఆయిల్ కంప్లీట్‌గా తగ్గిస్తే తప్ప.. బ్రాండ్ మారిస్తే ఏం ఉపయోగం ఉండదని ఆయన తెలిపారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే నిపుణులను సంప్రదించండి.)