Vitamin D Food: మానవ శరీరంలో విటమిన్-డి కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలోని ప్రతి అవయవానికీ విటమిన్ డి అవసరం ఉంటుంది. అన్ని అవయవాలు సరిగ్గా పనిచేయాలంటే సరిపడ విటమిన్-డి అందుతుండాలి. అయితే నిజానికి మనుషులకు అవసరమయ్యే విటమిన్-డి సూర్యరక్ష్మితో అందుతుంది. అయితే మారుతోన్న జీవనశైలి, పిట్టగోడలలాంటి ఇళ్లలో నివాసం, ఎండ తగలని జీవన విధానంతో సరిపడ విటమిన్ అందట్లేదు. దీంతో చాలా మంది తక్కువ వయసులో విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు. దీంతో చాలా మంది కృత్రిమంగా ‘విటమిన్-డి’ని పొందడానికి ట్యాబ్లెట్లు వాడుతున్నారు. అయితే దీని వల్ల ప్రారంభంలో బాగానే ఉన్నా.. దీర్ఘకాలంలో మాత్రం సమస్యలు ఎదుర్కొనే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే మనం రోజు తీసుకునే ఆహారం ద్వారానే ‘విటమిన్-డి’ని పొందే వీలుంటే బాగుంటుంది. కదూ.. మరి ప్రకృతి మనకు సహజంగా అందించే ఏయో పదార్థాల్లో విటమిన్-డి పుష్కలంగా లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
పాలు, పెరుగు, మజ్జిగ, ఛీజ్, బటర్, పన్నీర్ వంటి ఆహార పదార్థాల్లో విటమిన్-డి పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటు ఎగ్స్ కూడా విటమిన్-డి లభిస్తుంది. ఇక గుడ్డులో ఉండే యోక్‌ను కచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్-డి ఎక్కువగా ఉండేది ఇందులోనే.
డి-విటమిన్ పుష్కలంగా లభించే మరో ఆహార పదార్థం చేపలు. ముఖ్యంగా సాల్మన్, ట్యూన ఫిష్‌లలో ఎక్కువగా లభిస్తుంది. అంతేకాకుండా ఈ చేపల్లో ఉండే కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
ఇటీవలి కాలంలో పుట్ట గొడుగులను ఆహారంలో భాగం చేసుకోవడం బాగా పెరిగిపోయింది. ఇక రుచిలో కూడా మేటిగా ఉండే పుట్టగొడుగుల్లో డి-విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.
గోధుమలు, రాగులు, బార్లీ, ఓట్స్ వంటి తృణ ధాన్యాల్లో విటమిన్-డి పుష్కలంగా ఉంటాయి. అయితే వీటిని ప్రాసెస్ చేయకుండా తీసుకుంటేనే వీటిలో ఉండే పోషక విలువలు శరీరానికి అందుతాయి.
దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లలో పుష్కలంగా విటమిన్-డి లభిస్తుంది. ఈ పండ్లను ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల సహజంగా విటమిన్-డి పొందే అవకాశాలుంటాయి.
ఆకు కూరలతో కూడా శరీరానికి అవసరమై విటమిన్-డి అందుతుంది. ముఖ్యంగా తోటకూర, మునగాకు వంటి ఆకు కూరలు నిత్యం తీసుకోవడం ద్వారా విటమిన్-డి లభిస్తుంది.
Also Read: Best Food : తల్లిదండ్రులకు సూచన.. ఎగ్జామ్స్ సమయంలో మీ పిల్లలకు పెట్టాల్సిన బెస్ట్ ఫుడ్ ఎంటో తెలుసా..