Bone Health: ఇలాంటి అలవాట్లే కొంపముంచుతాయి జాగ్రత్త.. ఎముకలలో ఈ తేడా కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి

|

Oct 10, 2022 | 8:31 PM

ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా చాలామంది బాధపడుతున్నారు.

Bone Health: ఇలాంటి అలవాట్లే కొంపముంచుతాయి జాగ్రత్త.. ఎముకలలో ఈ తేడా కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వండి
Bone Health
Follow us on

ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ ఎముకలు బలహీనత అనేది పెను సమస్యగా మారుతుంది. ఎముకలు శరీర నిర్మాణానికి సహాయకంగా నిలిచే వ్యవస్థను కలిగి ఉండటంతోపాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. మరోవైపు, ఎముకలు బలహీనంగా ఉంటే, నొప్పి సమస్య పెరగడంతోపాటు.. ఎముకలకు సంబంధించిన పలు సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూసుకోవాలి. అదే సమయంలో, కొన్నిసార్లు మనం చేసే తప్పుల వల్ల ఎముకలు బలహీనంగా మారవచ్చు. అందుకే మన ఎముకలను బలహీనపరిచే చెడు అలవాట్ల గురించి కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ చెడు అలవాట్లు బలహీనమైన ఎముకలకు దారితీస్తాయి.. అవేంటంటే..

తగినంత సూర్యరశ్మిని తీసుకోకపోవడం: కొంతమంది ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. దీని కారణంగా వారికి తగినంత విటమిన్ డి లభించదు. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. విటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకలకు కాల్షియం సరిగా అందదు. అందువల్ల, మీ ఆహారంలో విటమిన్ డికి సంబంధించిన వాటిని చేర్చుకోండి. లేదా ప్రతిరోజూ 30 నిమిషాల సూర్యకాంతిని తీసుకోండి.

ఇవి కూడా చదవండి

ఎక్కువ సేపు కూర్చోవడం: కొందరు నిరంతరంగా గంటల తరబడి కూర్చుంటారు. ఇలా చేయడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అవసరం. కావున రోజూ వ్యాయామం చేయడంతోపాటు ఒకే చోట గంటల తరబడి కూర్చోవడం మానుకోండి.

ఉప్పు ఎక్కువగా తీసుకోవడం: సోడియం (ఉప్పు) శరీరానికి చాలా ముఖ్యమైనది. అదే సమయంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడటం మొదలవుతుంది. కావున.. ఉప్పును అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి.. సాధ్యమైనంత వరకు తక్కువ తింటేనే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

శీతల పానీయాలు తీసుకోవడం: చాలా మంది శీతల పానీయాలు తాగడానికి ఇష్టపడతారు. అయితే శీతల పానీయాలు తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. కావున దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం..