Blood Cancer: తరచూ రక్తంలో హిమోగ్లోబిన్‌ తగ్గుతోందా.? ప్రమాదకరం కావొచ్చు..

కొన్ని సందర్భాల్లో హిమోగ్లోబిన్‌ తగ్గడం వీవ్రమైన వ్యాధులకు కారణంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. హిమోగ్లోబిన్‌ స్థాయిలు ఒక్కసారిగా తగ్గడం బ్లడ్ క్యాన్సర్‌ లేదా ఎముక మజ్జ క్యాన్సర్‌, అప్లాస్టిక్ అనీమియా వంటి కొన్ని తీవ్రమైన వ్యాధులకు సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతం 12 నుంచి 13 గ్రాముల కంటే తక్కువకు పడిపోతే వెంటనే అలర్ట్‌ అవ్వాలని..

Blood Cancer: తరచూ రక్తంలో హిమోగ్లోబిన్‌ తగ్గుతోందా.? ప్రమాదకరం కావొచ్చు..
Blood

Updated on: Dec 06, 2023 | 10:11 AM

శరీరంలో హిమోగ్లోబిన్‌ది కీలక పాత్ర అనే విషయం తెలిసిందే. ఎర్ర రక్త కణాల్లో ఉండే ప్రోటీన్‌, శరీరానికి ఆక్సిజన్‌ను శరీరానికి తీసుకెళ్లడంలో హిమోగ్లోబిన్‌ది ముఖ్యపాత్ర. కొన్ని సందర్భాల్లో అనారోగ్య కారణాల వల్ల హిమోగ్లోబిన్‌ తగ్గుతుంది. అయితే ఈ సమస్య తరచూ వేధిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయొద్దని నిపుణులు చెబుతున్నారు.

కొన్ని సందర్భాల్లో హిమోగ్లోబిన్‌ తగ్గడం వీవ్రమైన వ్యాధులకు కారణంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. హిమోగ్లోబిన్‌ స్థాయిలు ఒక్కసారిగా తగ్గడం బ్లడ్ క్యాన్సర్‌ లేదా ఎముక మజ్జ క్యాన్సర్‌, అప్లాస్టిక్ అనీమియా వంటి కొన్ని తీవ్రమైన వ్యాధులకు సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. రక్తంలో హీమోగ్లోబిన్‌ శాతం 12 నుంచి 13 గ్రాముల కంటే తక్కువకు పడిపోతే వెంటనే అలర్ట్‌ అవ్వాలని వైద్యులు చెబుతున్నారు.

అయితే బ్లడ్‌ క్యాన్సర్‌ లక్షణాలు త్వరగా కనిపించవు. అయితే లక్షణాలు బయటపడే సమయానికి క్యాన్సర్‌ తీవ్రత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బ్లడ్‌ క్యాన్సర్‌లో కనిపించే ప్రధాన లక్షణాల్లో.. కారణం లేకుండా ఒక్కసారిగా బరువు తగ్గడం, జ్వరం, రాత్రి చమటలు పట్టడం, ఎముకల నొప్పి, తీవ్రమైన అసలట వంటి లక్షణాల ఆధారంగా బ్లడ్‌ క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. ఇక రక్త పరీక్షలలో రక్త హీనత, తక్కువ రక్త ఉత్పత్తి లేదా తరచుగా బ్లడ్‌ ఇన్ఫెక్షన్‌ కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని నిపునులు చెబుతున్నారు.

ఇక బ్లడ్‌ క్యాన్సర్‌ రక్తంలో లేదా ఎముక మజ్జలో ఉన్న మూల కణాలలో మార్పులతో ప్రారంభమవుతుంది. ఈ కణాలలో జన్యు ఉత్పరివర్తనలు అవి అనియంత్రితంగా పెరుగుతాయి. ఈ అసాధారణ కణాలు వేగంగా పెరుగుతూనే ఉంటాయి దీంతో రక్తహీనత, ఇన్ఫెక్షన్, రక్తస్రావం వంటి సమస్యలను కలిగిస్తాయి. బ్లడ్‌ క్యాన్సర్‌ మూడు రకాలుగా ఉంటాయి. రక్తంలో తెల్ల రక్త కణాలు భారీగా పెరిగే లుకేమియా క్యాన్సర్‌ అంటారు. శోషరస గ్రంథులు, శోషరస కణజాల క్యాన్సర్‌ను లింఫోమాగా పిలుస్తుంటారు. ఇక ప్లాస్మా కణాలలో వచ్చే క్యాన్సర్‌ను మైలోమాగా పిలుస్తారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించనవి మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ వార్తల కోసం క్లిక్ చేయండి..