Watermelon: కాలంతో సంబంధం లేకుండా దాదాపు అన్ని కాలాల్లో లభించే పండ్లలో పుచ్చకాయ ఒకటి. సులభంగా జీర్ణం అవ్వడం, ఎలాంటి ఫ్యాట్ కంటెంట్ లేకపోవడంతో నిపుణులు సైతం పుచ్చకాయను తీసుకోమని సూచిస్తుంటారు. అయితే అతి ఎప్పుడైనా అనార్థాలకు దారి తీస్తుంది అన్నట్లు. పుచ్చకాయను అతిగా తీసుకోవడం వల్ల అనార్థాలు ఉన్నాయని మీకు తెలుసా.? చల్లగా, తియ్యగా ఉందని ఇష్టమున్నట్లు తింటే మాత్రం సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ పుచ్చకాయను అతిగా తీసుకోవడం వల్ల ఎలాంటి నష్టాలు ఉంటాయి లాంటి పూర్తి వివరాలు మీకోసం..
పుచ్చకాయల్లో నీటి శాతం పుష్కలంగా ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అయితే అతిగా తింటే మాత్రం జీర్ణ సంబంధిత సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. పుచ్చకాయను అతిగా తీసుకోవడం వల్ల డయేరియా, కడుపు ఉబ్బడం వంటి సమస్యలు వస్తాయి. పుచ్చకాయల్లో ఉండే సార్బిటాల్ అనే కాంపౌడ్ వల్ల విరేచనలు, గ్యాస్ సంబంధిత సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
మీరు డయాబెటిక్ సమస్యతో బాధపడుతున్నారా.? అయితే వాటర్ మిలాన్ అతిగా తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయి. ఇందులో ఉండే గ్లైకమిక్ ఇండెక్స్ కారణంగా రక్తంలో షుగర్ స్థాయిలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
పుచ్చకాయను అతిగా తీసుకోవడం వల్ల లివర్‌పై కూడా ప్రమాదం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఉన్న వారు అతిగా పుచ్చకాయ తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఎందుకంటే పుచ్చకాయలో ఉండే లైకోపీన్ ఆల్కహాల్‌తో వ్యతిరేకంగా స్పందించడం వల్ల లివర్ వాపునకు గురయ్యే అవకాశం ఉంటుంది.
శరీరానికి సరిపడ నీరు అందకపోతే డీహైడ్రేషన్ అయినట్లే నీరు ఎక్కువగా అందడం కూడా శరీరానికి అంత మంచిది కాదు. శరీరంలో నీటి శాతం పెరిగితే శరీరంలోని సోడియం శాతం కోల్పోయే ప్రమాదం ఉంది.
పుచ్చకాయల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీంతో శరీరానికి అవసరమైన పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. అయితే పొటాషియం అధికంగా తీసుకుంటే హృద్రోగ సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల హృదయ స్పందనలో మార్పులు, పల్స్ రేట్ తగ్గడం వంటి సమస్యలు వస్తాయి.
మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..