Pomegranate peels: దానిమ్మ తొక్కలతో వినికిడి సమస్యకు చెక్ పెట్టొచ్చని తెలుసా.? ఇంకా మరెన్నో అద్భుత ప్రయోజనాలు..

చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ దానిమ్మను ఇష్టపడని వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం రుచికే పరిమితం కాకుండా దానిమ్మ వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి...

Pomegranate peels: దానిమ్మ తొక్కలతో వినికిడి సమస్యకు చెక్ పెట్టొచ్చని తెలుసా.? ఇంకా మరెన్నో అద్భుత ప్రయోజనాలు..
Pomegranate Peels

Edited By:

Updated on: Dec 13, 2022 | 2:52 PM

చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకూ దానిమ్మను ఇష్టపడని వారు ఉండరనడంలో ఎలాంటి సందేహం లేదు. కేవలం రుచికే పరిమితం కాకుండా దానిమ్మ వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. దానిమ్మ తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం పెరుగుతుందని వైద్యులు చెబుతారు. ఇక పోషకాల గని అయిన దానిమ్మలో అనేక యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. దానిమ్మను తినడం వల్ల క్యాన్సర్ ముప్పు నుంచి కూడా బయట పడవచ్చు. అయితే సాధారణంగా దానిమ్మ తొక్కను తీసి పడేస్తుంటాం. కానీ దానిమ్మ తొక్కతో కూడా ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ తొక్కలకు ఆయుర్వేద వైద్యంలో చాలా ప్రాధాన్యత ఉంది. దానిమ్మ పండు దాదాపు యాబై శాతం తొక్కను కలిగి ఉంటుంది.

దానిమ్మ తొక్క వల్ల కలిగే ప్రయోజనాలు..

శరీర డీటాక్సిఫికేషన్ లో సాయం..

దానిమ్మలో ఉండే  యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని టాక్సిన్లతో వేగంగా పోరాడతాయి. శరీరాన్ని డీటాక్సిఫికేషన్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్లు ఉపయోగపడతాయి. దానిమ్మ తొక్కల రసాన్ని సేవిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

వృద్ధాప్య, చర్మ సమస్యలు దూరం

దానిమ్మ తొక్కలో ఉండే కొల్లాజెన్ చర్మ విచ్ఛిన్నతను తొలగిస్తుంది. అలాగే చర్మం ముడతలు పడకుండా సాయం చేస్తుంది. అలాగే మొటిమలు, దద్దుర్లు వంటి సమస్యలతో పోరాడుతుంది. దానిమ్మ తొక్కలో ఉండే యాంటి ఆక్సిడెంట్లు బ్యాక్టీరియా, ఇతర ఇన్ ఫెక్షన్లను దూరంగా ఉంచుతాయి.

ఇవి కూడా చదవండి

ధీర్ఘకాల వ్యాధులు దూరం

దానిమ్మ తొక్కలను తరచూ తీసుకుంటే గుండె జబ్బులు, మధుమేహం వంటి ధీర్ఘకాలిక సమస్యలకు చెక్ పెట్టొచ్చు. 1000 mg దానిమ్మ తొక్కల సారాన్ని తీసుకుంటే అధిక బరువును తగ్గించుకోవచ్చు. అలాగే ఊబకాయం సమస్యతో బాధపడే వారిలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించి యాంటీ ఇన్ సప్లిమెంటరీ ఏజెంట్ గా పని చేస్తుంది.

వినికిడి లోపం ఉన్నవారికి..

దానిమ్మ తొక్కలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా వినికిడి లోపం నుంచి బయటపడవచ్చు. ఆక్సీడేటివ్ స్ట్రెస్ వల్ల వచ్చే వినికిడి సమస్యలున్న వారు దానిమ్మ తొక్కల రసాన్ని తీసుకుంటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

జుట్టు సమస్యల నుంచి రక్షణ..

దానిమ్మ తొక్కలను ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని నూనెతో కలిపి తలకు ప్యాక్ లా రాసుకోవాలి. అనంతరం రెండు గంటల తర్వాత తల స్నానం చేస్తే జుట్టు రాలడం, చుండ్రు సమస్యల నుంచి బయటపడవచ్చు.

గొంతు నొప్పి, దగ్గు సమస్యలు దూరం..

సంప్రదాయ ఔషధ పద్ధతుల ప్రకారం దానిమ్మ తొక్క దగ్గు నుంచి ఉపశమనానికి ఉపయోగపడుతుంది. అలాగే దానిమ్మ తొక్కను పొడి చేసి నీళ్లల్లో కలుపుకుని తాగితే గొంతు నొప్పి సమస్య నుంచి బయట పడవచ్చు. దానిమ్మ తొక్కలో ఉండే హైడ్రో ఆల్కహాలిక్ సారం గొంతు నొప్పి, దగ్గు నివారణకు సాయం చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..