Healthy Food: ఖ‌ర్జూర‌ తినే అల‌వాటు లేదా..? ఈ లాభాలు తెలిస్తే మాత్రం అస్స‌లు వ‌దిలి పెట్ట‌రు..

| Edited By: Ravi Kiran

Jan 15, 2022 | 7:09 AM

Healthy Food: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆరోగ్యాన్ని తీసుకోవాలి. ఇది అంద‌రికీ తెలిసిందే. అయితే ఆరోగ్యమైన ఆహారం కోసం ఖ‌ర్చు చేయ‌డానికి వెన‌కా ముందు అవుతుంటారు. ఫాస్ట్ ఫుడ్ కోసం రూ. వంద‌లు ఖ‌ర్చుపెట్టే వారు..

Healthy Food: ఖ‌ర్జూర‌ తినే అల‌వాటు లేదా..? ఈ లాభాలు తెలిస్తే మాత్రం అస్స‌లు వ‌దిలి పెట్ట‌రు..
Follow us on

Healthy Food: ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆరోగ్యాన్ని తీసుకోవాలి. ఇది అంద‌రికీ తెలిసిందే. అయితే ఆరోగ్యమైన ఆహారం కోసం ఖ‌ర్చు చేయ‌డానికి వెన‌కా ముందు అవుతుంటారు. ఫాస్ట్ ఫుడ్ కోసం రూ. వంద‌లు ఖ‌ర్చుపెట్టే వారు పండ్లు కొనుగోలు చేయ‌డానికి మాత్రం ఆస‌క్తిచూపించరు. ఇక పండ్లు తిన్నా యాపిల్‌, అర‌టి పండ్ల‌కే ప్రాధాన్య‌త ఇస్తారు. అయితే ఖ‌ర్చూర (Dates)లో కూడా ఎన్నో పోష‌కాలు ఉన్నాయ‌ని మీకు తెలుసా.? రాత్రి ప‌డుకునే ముందు రెండంటే రెండు.. ఖ‌ర్జూరాలు తిన‌డం వ‌ల్ల మీ శ‌రీరంలో జ‌రిగే మార్పులు ఏంటో తెలిస్తే అవాక్క‌వుతారు. ఇంత‌కీ ఖ‌ర్జూర వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

* ఖ‌ర్జూరాలు విట‌మిన్ ఎకు పెట్టింది పేరుగా చెబుతారు. కంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారికి దీనిని ఒక దివ్యౌష‌ధంగా చెప్ప‌వ‌చ్చు. ప్ర‌తీరోజూ ఖ‌ర్చూరం తీసుకోవ‌డం వ‌ల్ల కంటి స‌మ‌స్య‌ల‌ను ద‌రి చేర‌కుండా చూసుకోవ‌చ్చు.

* ఖ‌ర్జూరాల వ‌ల్ల చ‌ర్మం కూడా కాంతి వంతంగా మారుతుంది. ఇందులో ఉండే విట‌మిన్లు, ఐర‌న్ కార‌ణంగా చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా మారుతుంది.

* రోగ నిరోధ‌క్తి పెర‌గ‌డంలో ఖ‌ర్జూరాలది కీలక పాత్ర‌. వీటిలో ఉండే ఐర‌న్‌, ప్రోటీన్స్‌, ఫైబర్ కార‌ణంగా రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి, వ్యాధులు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

* ఖ‌ర్జూరంలో ఉండే పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఎముక‌ల పటుత్వానికి దోహ‌ద‌ప‌డ‌తాయి. ముఖ్యంగా వీటివ‌ల్ల ఎముక‌లు బ‌లోపేతం అవుతాయి. అలాగే కండరాల స‌మస్య‌లు కూడా త‌గ్గుతాయి.

* గుండె జ‌బ్బులు ఉన్న వారికి కూడా ఖ‌ర్జురాలు మంచి ఔష‌ధంలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గుండె సంబంధిత వ్యాధులతో బాధ‌ప‌డే వారు క‌చ్చితంగా ఖ‌ర్జూరాన్ని తీసుకోవాలి.

* ఖ‌ర్జూరాల్లో ఉండే ఐర‌న్ ర‌క్త హీన‌త స‌మ‌స్య‌కు చెక్ పెడుతుంది. ర‌క్తం త‌క్కువ‌గా ఉండే వారు రోజూ ఖ‌ర్జూరాన్ని తీసుకుంటే మంచి ఫ‌లితం ఉంటుంది.

* అధిక బ‌రువు త‌గ్గించ‌డానికి కూడా ఖ‌ర్జూరాలు దోహ‌ద‌ప‌డ‌తాయి. ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉండే కొవ్వును త‌గ్గించ‌డంలో ఖ‌ర్జూరాల‌ది కీల‌క పాత్ర.

Also Read: Priyanka Chopra: ఇన్‌స్టాగ్రామ్‌లో భ‌ర్త పేరు తొల‌గించ‌డంపై స్పందించిన ప్రియాంక‌.. అస‌లు కార‌ణం అదేనంటా..

Indian Railway: రైలు గార్డ్‌ అని పిలవకండి.. ట్రైన్‌ మేనేజర్‌ అని పిలవండి.. కీలక మార్పులు చేసిన రైల్వే శాఖ..!