Health Tips : తీసుకునే ఆహరంలో జాగ్రత్తలు పాటిస్తే ఆరోగ్యంగా ఉండగలుగుతాం.. దీర్ఘకాలిక వ్యాదులనుంచి, రోగాలనుంచి బయట పడాలంటే మంచి డైట్ ను ఫాలో అవ్వాల్సిందే. ముఖ్యంగా ప్రగ్నెన్సీ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తీసుకునే ఆహారంలో చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ప్రెగ్నెన్సీలో కూడా ఆరోగ్యంగా ఉంటారు. గర్భిణీ స్త్రీలు సరైన పద్ధతిలో ఆహారం తీసుకోవడం, పోషకాహారం తీసుకోవడం, ఒత్తిడి లేకుండా ఉండటం చాలా ముఖ్యం. గర్భిణీలు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. పండ్లు, కూరగాయలు, పప్పులు, పాల ఉత్పత్తులు, మాంసం ఎక్కువగా తీసుకోవాలి. ఈ కిందివాటిని తీసుకోవడం వల్ల గర్భిణీ స్త్రీలకూ అనే ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
బాదం, జీడిపప్పు, అక్రోట్లు, వేరుశెనగ, పిస్తాపప్పులులాంటివి చాలా మంచి ఆహారం. వీటిలో ఫ్యాట్స్, మాంసకృత్తులు, పీచుపదార్థాలు, విటమిన్లు మినరల్స్ ఉంటాయి. మెగ్నీషియం బాందపప్పులో అధికంగా ఉంటుంది. వీటిని ప్రతి రోజూ ఎప్పుడైనా సరే గర్భిణీలు తినవచ్చు. బీట్రూట్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. గర్భిణీల్లో రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుంది. శరీరానికి అవసరమైన ఐరన్ ను అందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎండిన ఖర్జూర పండ్ల వల్ల శరీరానికి అవసరమైన ఐరన్, ఫోలేట్ లు అందుతాయి. అలాగే శరీరానికి అవసరమైన ఫైబర్‌ను ఇవి అందిస్తాయి. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అలాగే ప్రెగ్నెన్సీ సమయంలో చేపలు తినడం మంచిది, కాని సముద్రపు చేపలకన్నా కూడా మంచి నీటి చేపలను తీసుకుంటే మంచిది. గర్భిణీ స్త్రీలు శరీరంలో పాదరసం అధికంగా ఉండే చేపలను తినకుండా ఉండాలి. దానిమ్మ పండులో ఫోలేట్, పొటాషియం, విటమిన్ కే, ఐరన్, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల దానిమ్మను నేరుగాగానీ జ్యూస్‌ను గానీ నెల రోజుల పాటు క్రమం తప్పకుండా తాగాలి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
మరిన్ని ఇక్కడచదవండి :