Health: మీలో ఈ లక్షణాలున్నాయా.? పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది..

రుగుతోన్న మానసిక ఒత్తిడి కారణంగా ఇటవీల పక్షవాతం బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒక్కసారి పక్షవాతం బారిన పడితే జీవితం చాలా కష్టంగా మారుతోంది. అయితే పక్షవాతం వచ్చిన వెంటనే అలర్ట్ అయితే, ఆ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. అలాగే పక్షవాతం వచ్చే ముందే పసిగడితే చికిత్స కూడా త్వరగా అందిస్తే నష్టం తగ్గుతుంది. అయితే కొన్ని లక్షణాల ద్వారా...

Health: మీలో ఈ లక్షణాలున్నాయా.? పక్షవాతం వచ్చే ప్రమాదం ఉంది..
Symptoms Of Paralysis

Updated on: Nov 28, 2023 | 9:59 PM

మారుతోన్న జీవన విధానం, పెరుగుతోన్న మానసిక ఒత్తిడి కారణంగా ఇటవీల పక్షవాతం బారిన పడుతోన్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఒక్కసారి పక్షవాతం బారిన పడితే జీవితం చాలా కష్టంగా మారుతోంది. అయితే పక్షవాతం వచ్చిన వెంటనే అలర్ట్ అయితే, ఆ సమస్య నుంచి త్వరగా బయటపడొచ్చు. అలాగే పక్షవాతం వచ్చే ముందే పసిగడితే చికిత్స కూడా త్వరగా అందిస్తే నష్టం తగ్గుతుంది. అయితే కొన్ని లక్షణాల ద్వారా పక్షవాత ప్రమాదాన్ని ముందుగానే గుర్తించవచ్చు. ఇంతకీ ఆ లక్షణాలు ఏంటంటే..

* నిత్యం బలహీనంగా అనిపిస్తున్నా, అకస్మాత్తుగా కాళ్లు, లేదా చేతులు తిమ్మిరిపట్టినట్లు అనిపించినా వెంటనే అలర్ట్‌ కావాలని నిపుణులు చెబుతున్నారు.

* ఇక ఒక కాలు లేదా ఒక చేయి ఒకవైపే లాగుతున్నట్లు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా పక్షవాతానికి ముందస్తు లక్షణంగా భావించాలి.

* కొన్ని సందర్భాల్లో ముఖం కూడా ఒక వైపు లాగినట్లు ఉంటుంది. మరీ ముఖ్యంగా నవ్వుతున్న సమయంలో ఇలాంటి భావన కలిగితే వెంటనే వైద్యులను సంప్రందిచాలని నిపుణులు చెబుతున్నారు.

* మాటలు అస్పష్టంగా ఉన్నా, మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నా జాగ్రత్తపడాలని నిపుణులు చెబుతున్నారు. ఏదైనా విషయాన్ని చెప్పినప్పుడు అర్థం చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు.

* ఆకస్మాత్తుగా తీవ్రమైన తలనొప్పి వస్తే రక్తస్రావం జరుగుతున్నట్లు అర్థం చేసుకోవాలి. తలలో తీవ్రైన తలనొప్పి వచ్చి మెదడులో రక్తస్రావం జరుగుతుండొచ్చని నిపుణులు చెబుతున్నారు. చూపు అస్పష్టంగా ఉన్నా వైద్యులను సంప్రదించాలి.

* ఎదుట ఉన్న వస్తువులు ఒకటి రెండుగా కనిపించడం, మైకం కమ్మినట్లు అవుతుంది. తల తిరగడం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ ఉండకపోయినా.. స్ట్రోక్‌ వచ్చే ముందు కనిపించే లక్షణాలుగా చెబుతున్నారు.

* ఒకవేళ స్ట్రోక్‌ వచ్చిన వెంటనే.. వైద్యులను సంప్రదించడం ద్వారా ప్రమాద తీవ్రతను తగ్గించుకోవచ్చు. మెదడులోని న్యూరాన్లు నశించడం మొదలవుతాయి. సిగరెట్ తాగేవారు, మధుమేహం, అధిక రక్తపోటు, అధిక ఒత్తిడి ఉన్న వారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..