Health: మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.? వెంట‌నే చెక్ చేసుకోండి.. లో బీపీ కావొచ్చు..

| Edited By: Ravi Kiran

Jan 16, 2022 | 9:01 AM

Health: మ‌నిషి ఆరోగ్య ఉండాలంటే జీవ‌క్రియ‌ల‌న్నీ స‌క్ర‌మంగా జ‌ర‌గాలి. ముఖ్యంగా ఎంతో కీల‌క‌మైన గుండె సుర‌క్షితంగా ఉండాలంటే ర‌క్త‌పోటు కంట్రోల్‌లో ఉండాలి. బీపీ ఎక్కువైనా.. త‌క్కువైనా ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌నే విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. బీపీ ఎక్కువైతే..

Health: మీలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయా.? వెంట‌నే చెక్ చేసుకోండి.. లో బీపీ కావొచ్చు..
Follow us on

Health: మ‌నిషి ఆరోగ్య ఉండాలంటే జీవ‌క్రియ‌ల‌న్నీ స‌క్ర‌మంగా జ‌ర‌గాలి. ముఖ్యంగా ఎంతో కీల‌క‌మైన గుండె సుర‌క్షితంగా ఉండాలంటే ర‌క్త‌పోటు కంట్రోల్‌లో ఉండాలి. బీపీ ఎక్కువైనా.. త‌క్కువైనా ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌నే విష‌యం మ‌నంద‌రికీ తెలిసిందే. బీపీ ఎక్కువైతే వాటి తాలుకూ ల‌క్షణాలు వెంట‌నే భ‌య‌ట‌ప‌డ‌తాయి. కానీ లో అయితే మాత్రం కాస్త ఆల‌స్యంగా ల‌క్ష‌ణాలు తెలుస్తాయి. మ‌రి లోబీపీ ఉంటే ముంద‌స్తుగానే కొన్ని ల‌క్ష‌ణాల ద్వారా క‌నిపెట్ట‌వ‌చ్చ‌ని మీకు తెలుసా.? ఇంత‌కీ లోబీపీ ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలేంటంటే..

* సాధార‌ణంగా మ‌హిళ‌ల్లో 60/100 , మగవారిలో 70/110 కంటే తక్కువగా ఉంటే లోబీపీ ఉన్నట్లే అని అర్థం చేసుకోవాలి.

* లోబీపీ ఉన్న వారికి కూర్చొని పైకి లేచిన‌ప్పుడ‌ల్లా త‌ల దిమ్ముగా అనిపిస్తుంది. ఇలా నిత్యం జ‌రుగుతుంటే బీపీ త‌గ్గిన‌ట్లే అర్థం చేసుకోవాలి. వెంట‌నే బీపీ టెస్ట్ చేయించుకోవ‌డం మంచిది.

* ఇక లోబీపీ ఉన్న వారికి కొంద‌రిలో క‌ళ్లు మ‌స‌క‌గా క‌నిపిస్తాయి. ఎలాంటి సైట్ స‌మ‌స్య లేక‌పోయినా వ‌స్తువులు మ‌స‌క‌గా క‌నిపిస్తుంటాయి.

* బీపీ త‌క్కువగా ఉండే ఏ ప‌ని చేసినా వెంట‌నే అల‌సిపోతారు. కాస్త దూరం న‌డిచినా ఆయసం వ‌స్తుంది. అలాగే ఎక్కువ సేపు ఒక పనిని చేయ‌లేరు.

* కొంద‌రిలో లోబీపీ ఉంటే త‌ల‌నొప్పి, వికారం ఉంటుంది. ఇక మ‌రికొంద‌రిలో అయితే మూర్చ కూడా వ‌చ్చే ప్ర‌మాదం ఉంది. కాబ‌ట్టి పైన తెలిపిన ల‌క్ష‌ణాలు క‌నిపించిన వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించ‌డం మంచిది.

* ఇక లోబీపీతో బాధ‌ప‌డేవారు నిత్యం స‌రిప‌డ నీరు తాగాలి. అలాగే ప్ర‌తిరోజూ యోగా, ఎక్సర్‌సైజ్‌లు చేయాలి. మంచి ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

Also Read: IPL 2022 Mega Auction: మెగా వేలంలో సూపర్ సీనియర్ ప్లేయర్స్..!

Election 2022: ఈసీ కీలక నిర్ణయం.. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంక్షలు మరోసారి పొడగింపు..

Viral Video: తోపులనే తలదన్నేలా.. ఈత కొట్టేందుకు భారీ జంప్ చేసిన శునకం.. వీడియో వైరల్..