Health: మెరుగైన రక్త ప్రసరణ కోసం.. ఈ ఫుడ్‌ తీసుకోండి..

మంచి రక్త ప్రసరణ వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం సరిగ్గా అందుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధులతో పాటు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే తీసుకునే ఆహారం ద్వారా మెరుగైన రక్తప్రసరణ సొంతం...

Health: మెరుగైన రక్త ప్రసరణ కోసం.. ఈ ఫుడ్‌ తీసుకోండి..
Healthy Blood Circulation

Updated on: Jan 14, 2024 | 8:45 PM

మనిషి ఆరోగ్యం రక్తప్రసరణపై ఆధారపడి ఉంటుందని తెలిసిందే. సరైన రక్తప్రసరణ వల్ల శరీరంలోని ప్రతీ భాగానికి అవసరమైన పోషకాలు, ఆక్సిజన్‌ అందుతుంది. మంచి రక్త ప్రసరణ వల్ల శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం సరిగ్గా అందుతుంది. అయితే కొన్ని కారణాల వల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీనివల్ల హృదయ సంబంధిత వ్యాధులతో పాటు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయితే తీసుకునే ఆహారం ద్వారా మెరుగైన రక్తప్రసరణ సొంతం చేసుకోవచ్చని మీకు తెలుసా.? ఇంతకీ ఏ ఫుడ్‌ తీసుకుంటే రక్త ప్రసరణ మెరుగవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

* బెర్రీలు మెరుగైన రక్త ప్రసరణకు ఉపయోగపడుతాయి. బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలు వంటి యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. రక్తనాళాల ఆరోగ్యానికి తోడ్పడే వాపును తగ్గించే సమ్మేళనాలను కూడా ఇవి కలిగి ఉంటాయి.

* బచ్చలికూర రక్త ప్రసరణలో సహాయపడతాయి. ఇందులో నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్త నాళాలను విశాలం చేస్తాయి అలాగే రక్త ప్రవహాన్ని మెరుగుపరుస్తుంది.

* సాల్మన్‌ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆరోగ్యకరమైన కొవ్వులు రక్తం గడ్డకట్టడాన్ని తగ్గించడానికి, రక్తపోటును తగ్గించడానికి ఉపయోగపడతాయి.

* బాదం, వాల్‌నట్స్‌, అవిసె గింజలు, చియా గింజలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ఫైబర్‌కు పెట్టింది పేరు. ఇవి గుండె ఆరోగ్యం మెరుగవడంతో పాటు, గుండెలో మంటను తగ్గిస్తుంది. అలాగే.. మెరుగైన రక్త ప్రసరణకు దోహదం చేస్తాయి.

* నారింజ, ద్రాక్ష, నిమ్మకాయలు విటమిన్‌ సికి పెట్టింది పేరు. రక్త నాళాల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. విటమిన్ సి కూడా ఐరన్ శోషణలో సహాయపడుతుంది. ఇది ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాలను ప్రోత్సహిస్తుంది.

* వెల్లుల్లి రక్తనాళాలను లూజ్‌ చేయడంతో పాటు, రక్తపోటును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, మెరుగైన రక్త ప్రసరణకు దోహదం చేస్తాయి.

* రక్త ప్రసరణ మెరుగుపరచడంలో పుచ్చకాయ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని సిట్రులిన్ అనే అమైనో ఆమ్లం రక్త నాళాలను సడలించడంతో రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..