భారతీయ సంస్కృతిలో తమలపాకులకు (Betel Leaf) ఎంతో ప్రాధాన్యత ఉంది. శుభకార్యాలలో.. దేవుడి పూజకు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఆరవ శతాబ్ధానికి చెందిన స్కంద పురాణంలో కూడా గుండె ఆకారంలో ఉండే తమలపాకు ప్రస్తావన ఉంది. సముద్ర మంథనం సమయంలో దేవతలు.. అసురుసులు అమృతం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ తమలపాకు బయటకు వచ్చిందని చెబుతుంటారు. తమలపాకులను తాంబూలం.. నాగవల్లి.. నాగర్ బెల్ అని కూడా పిలుస్తారు. మన హిందూ సంప్రదాయంలో తమలపాకులతో చేసే పాన్ ను భోజనం తర్వాత తింటారు. ఇది మౌత్ ఫ్రెషనర్‌గా పనిచేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం తమలపాకులు.. పాన్ తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఎన్నో ఔషద గుణాలున్నాయి. అలాగే.. ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
తమలపాకు లేదా పాన్‌లో అధిక నీటి శాతం.. తక్కువ కేలరీలు ఉంటాయి. ఇది తక్కువ స్థాయిలో కొవ్వు.. పరిమితమైన ప్రోటీన్లను కూడా కలిగి ఉంటుంది. ఇందులో అయోడిన్, పొటాషియం, విటమిన్ A, విటమిన్ B1, విటమిన్ B2, నికోటినిక్ యాసిడ్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ తమలపాకులు.. పాన్ గురించి ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ దీక్షా భావ్ సర్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. పాన్.. తమలపాకులు దగ్గు, ఉబ్బసం, తలనొప్పి, రినైటిస్, కీళ్ల నొప్పులు, అనోరెక్సియా వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగపడుతుంది. ఇది నొప్పి, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తోంది. అంతేకాకుండా.. కఫం వంటి సమస్యల చికిత్స కు ఉపయోగపడుతుంది. ఈ తమలపాకుల్లో విటమిన్ సి, థయామిన్ , నియాసిస్, రిబోఫ్లావిన్, కెరోటిన్ వంటి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే కాల్షియం అధికంగా ఉంటుంది. ఈ తమలపాకు తీగను ఇంట్లో పెంచుకోవడం మంచిది.
పాన్ తినడం లేనివారు.. కేవలం తమలపాకులను నమలవచ్చు.. కానీ ఈ విధంగా పాన్ లడ్డూలను తయారు చేస్తే మాత్రం ఎవ్వరైనా తినేస్తారు.. పాన్ తయారు చేయడానికి గుల్కంద్, కొబ్బరి, సోపు గింజలు ఉపయోగిస్తారు..
కావాల్సినవి..
1. 4 తమలపాకులు..
2. టీస్పూన్ గుల్కంద్..
3. స్పూన్ ఫెన్నెల్ గింజలు..
4. టీస్పూన్ తురిమిన కొబ్బరి..
5. టేబుల్ స్పూన్ రాతి చెక్కెర
6. 1/4 కప్పు నీరు.
పాన్ లడ్డూ..
ముందుగా తమలపాకులను ముక్కలు చేసి మిక్సీలో వేయాలి. ఆ తర్వాత నీళ్లు మినహా అన్ని పదార్థాలను వేసి మిక్సీ పట్టాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు పోసి మెత్తగా బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత పాన్ లడ్డూలను రెడీ చేసుకోవాలి.
(నోట్: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే ముందుగా వైద్యులను సంప్రదించండి.)
Salman Khan: మళ్లీ చిక్కుల్లో సల్మాన్ ఖాన్.. ఆ ఇద్దరికీ సమన్లు జారీ చేసిన కోర్టు..