Headache: మీరు కావాలని చేసే ఈ తప్పులే తలనొప్పికి కారణం.. అవేంటో తెలుసా..?

|

Feb 19, 2022 | 5:12 PM

Headache: ఆధునిక ప్రపంచంలో చాలామంది తలనొప్పితో బాధపడుతున్నారు. కొన్నిసార్లు ఇది వెంటనే తగ్గిపోతుంది. కొన్నిసార్లు మాత్రం చాలా సమయం వేధిస్తుంది. దీనివల్ల మీరు ఏ పని

Headache: మీరు కావాలని చేసే ఈ తప్పులే తలనొప్పికి కారణం.. అవేంటో తెలుసా..?
Headache
Follow us on

Headache: ఆధునిక ప్రపంచంలో చాలామంది తలనొప్పితో బాధపడుతున్నారు. కొన్నిసార్లు ఇది వెంటనే తగ్గిపోతుంది. కొన్నిసార్లు మాత్రం చాలా సమయం వేధిస్తుంది. దీనివల్ల మీరు ఏ పని సరిగ్గా చేయలేరు. ఆఫీసుకి వెళ్లినా పనిపైనా దృష్టి పెట్టలేరు. దీనికోసం మీరు అనేక టాబ్లెట్లు వాడుతారు. అయినా ఉపశమనం ఉండదు. ఇలాంటి సమయంలో ఈ ఐదు పద్దతుల గురించి తెలుసుకోవడం మంచిది.

1. పుష్కలంగా నీరు తాగాలి

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. శరీరంలో నీరు లేకపోవడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఏర్పడుతుంది. ఇది తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలకు కారణమవుతుంది. మీరు తరచుగా తలనొప్పితో బాధపడుతుంటే, మీరు రోజులో ఎంత నీరు తాగుతున్నారో చెక్‌ చేసుకోండి. మీ శరీరంలో తగినంత నీరు లేకుంటే తలనొప్పి ఏర్పడుతుంది. వెంటనే రెండు మూడు గ్లాసుల నీరు తాగితే అర్ధగంటలో సమస్య తగ్గుముఖం పడుతుంది.

2. సరియైన నిద్ర

శారీరక, మానసిక ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరం. నిద్ర లేకపోతే మీరు తలనొప్పి సమస్యని ఎదుర్కొంటారు. పరిశోధన ప్రకారం.. 6 లేదా అంతకంటే ఎక్కువ గంటలు నిద్రపోయే వ్యక్తులకు ఎటువంటి తలనొప్పి ఉండదు. కానీ ఇంతకన్నా తక్కువ నిద్రపోతే తలనొప్పి వేధిస్తుంది. కాబట్టి రాత్రిపూట కనీసం 7 నుంచి 9 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి.

3. మద్యం తగ్గించండి

ఆల్కహాల్ సాధారణంగా తలనొప్పిని కలిగించదు. కానీ ఇది మైగ్రేన్ రోగులలో తలనొప్పికి కారణమవుతుంది. మైగ్రేన్ రోగులలో మూడింట ఒక వంతు మద్యం సేవించిన తర్వాత తలనొప్పితో బాధపడుతారు. ఇది కాకుండా ఆల్కహాల్ ఆందోళన, టెన్షన్‌, తదితర సమస్యలని సృష్టిస్తుంది.

4. ప్రతిరోజు యోగా చేయండి

తలనొప్పి, ఒత్తిడి, మానసిక సమస్యలు సహజమైన పద్దతిలో తగ్గించాలంటే అందుకు యోగా చేయడం సరైన మార్గం. దీనివల్ల జీవన నాణ్యతను మెరుగుపడుతుంది. డయాబెటీస్‌, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి యోగా దివ్య ఔషధంలా పనిచేస్తుంది. యోగావల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడుతాయి. యోగా తలనొప్పి ఫ్రీక్వెన్సీని తగ్గిస్తుంది.

5. అల్లం టీ తాగితే ఉపశమనం

అల్లం యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. శతాబ్దాలుగా సంప్రదాయ వైద్యంలో అల్లం ఉపయోగిస్తున్నారు. ఇది భారతీయ వంటకాలలో విస్తృతంగా వాడుతారు. పరిశోధన ప్రకారం మైగ్రేన్ తలనొప్పి తీవ్రతను తగ్గించడంలో అల్లం ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ఇది వికారం, వాంతులు వంటి లక్షణాలను కూడా తగ్గిస్తుంది.

Earthquake: నార్త్‌ ఇండియాలో భూకంపాలు ఎక్కువ.. రెండు నెలల్లో100 సార్లు ప్రకంపనలు.. కారణం ఏంటంటే..?

Viral Video: 60 ఏళ్ల రోజువారి కూలీ ఇప్పుడు సూపర్ మోడల్‌.. సోషల్‌మీడియాలో సంచలనం సృష్టిస్తున్న వీడియో..

Tarisai Musakanda: యాక్సిడెంట్ చేసిన క్రికెటర్.. టెన్నిస్ ప్లేయర్ మృతి..