Jackfruit Seeds: పనస గింజలను పడేస్తున్నారా..? అయితే ఆ ప్రయోజనాలన్నీ కోల్పోయినట్లే.. అవేంటంటే..?

Jackfruit Seeds health benefits: మనం ఆరోగ్యవంతంగా ఉండేలా చాలా రకాల పండ్లు దోహదపడుతుంటాయి. అయితే ఆ పండ్లను తిని వాటిలో ఉండే గింజలను పారేస్తుంటాము. వాటి గురించి సరైన ప్రయోజనాలు తెలియక పారేస్తుంటాం. ముందు అన్ని రకాల పండ్ల గురించి

Jackfruit Seeds: పనస గింజలను పడేస్తున్నారా..? అయితే ఆ ప్రయోజనాలన్నీ కోల్పోయినట్లే.. అవేంటంటే..?
Jackfruit Seeds
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 29, 2021 | 2:52 PM

Jackfruit Seeds health benefits: మనం ఆరోగ్యవంతంగా ఉండేలా చాలా రకాల పండ్లు దోహదపడుతుంటాయి. అయితే ఆ పండ్లను తిని వాటిలో ఉండే గింజలను పారేస్తుంటాము. వాటి గురించి సరైన ప్రయోజనాలు తెలియక పారేస్తుంటాం. ముందు అన్ని రకాల పండ్ల గురించి తెలుసుకుంటే.. ఆ పండ్లల్లో ఉండే గింజలను పడేయరని పేర్కొంటున్నారు వైద్య నిపుణులు. అలాంటి పండ్లల్లో పనస పండ్లు ఒకటి. పనస పండును జాక్ ఫ్రూట్ అంటారు. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండు తొనల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంది. దీంతోపాటు పనస వల్ల మనసిక ఉల్లాసం కలుగుతుంది. అలసట తగ్గతుంది. చర్మ సౌందర్యంతోపాటు ఆరోగ్యవంతంగా ఉండేలా పనస సహకరిస్తుంది. అయితే.. పనస పండు ఉపయోగాలతోపాటు.. వాటి గింజల వల్ల కలిగే ఉపయోగాలను కూడా మనం తెలుసుకోవాలి. ఈ పండు గింజలను పడేసే ముందు ఒకసారి తెలుసుకోవాలని.. ఆ ప్రయోజనాల గురించి తెలుసుకోవాలని సూచిస్తున్నారు. పనస తొనలు తిన్న అనంతరం గింజలను పడేయకుండా పలు రూపాల్లో తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. శరీర జీర్ణక్రియ ప్రక్రియ సాఫిగా జరగనప్పుడు పనస పండు గింజలు దివ్య ఔషధంగా పనిచేస్తాయి. జీర్ణక్రియ ఇబ్బందులతో ప్రశాంతత ఉండదు.. శరీరం బరువుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు పనసపండు గింజలను ఉడికించి తింటే.. ఆహారం త్వరగా జీర్ణమై అజీర్తి సమస్యలు దూరమవుతాయి.

కంటి సమస్యలు దూరమవుతాయి.. ప్రస్తుతం పదేళ్ల లోపు వారందరికీ కళ్లద్దాలు వస్తున్నాయి. తరచుగా టీవీ, మొబైల్, కంప్యూటర్ చూడటం వల్ల కళ్లకు ఎక్కువ ఒత్తిడి కలుగుతోంది. దీనివల్ల కంటి సమస్యలు పెరుగుతున్నాయి. కావున కంటి ఆరోగ్యంపై దృష్టిపెట్టాల్సి అవసరం ఎంతైనా ఉంది. ఈ సమస్యల పరిష్కారం కోసం మొలకెత్తిన పనస గింజలు తినాలని సూచిస్తున్నారు.

ధృఢమైన బలమైన కేశాల కోసం.. మహిళలకు పొడవాటి జుట్టు ఉంటేనే అందం. అందుకే అందరూ పొడవాటి జుట్టు కోసం ఏవేవో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తుంటారు. పని ఒత్తిడి వల్ల ఉన్న జుట్టు కూడా రాలిపోతుంటుంది. అలాంటి వారికి పనస గింజలు అధిక మేలు చేస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

చర్మ ముడుతలకు.. అందరూ యంగ్ అంట్ ఎనర్జిటిక్ గా కనిపించాలని ముఖానికి ఏవేవో ఫేస్ క్రిములు రాస్తుంటాయి. అయినా.. చర్మం ముడుతలు తగ్గవు. దీంతో వారు ఎంతో పెద్ద వారుగా కనిపిస్తుంటారు. అలాంటి వారు పనస పండు తింటే.. చర్మ సౌందర్యం పెరుగుతుంది. దీంతోపాటు పనస విత్తనాలను చూర్ణం చేసి పాలతో కలిపి తీసుకుంటే.. ముఖంపై ముడతలు తగ్గి ప్రకాశవంతంగా మారుతుంది.

లైంగిక సామర్థ్యం.. మనిషికి నీరు, ఆహారం, నిద్రతోపాటు శృంగారం కూడా చాలా ముఖ్యం. శృంగారంలో సంతృప్తి చెందకపోతే.. పనస తొనలతోపాటు.. గింజలను ప్రతిరోజూ తింటే ఫలితం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. దీనివల్ల దాంపత్య జీవితం కూడా ఆనందమయంగా మారుతుంది.

Also Read:

Health Tips: నోటి నుంచి దుర్వాసన వస్తోందా..! ఈ వంటింటి చిట్కాలను ట్రై చేయండి చాలు..

Homeopathy: కరోనా కట్టడికి హోమియో చికిత్స.. హైదరాబాద్ కేంద్రంగా ట్రయల్స్.. వివరాలు..