చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న ‘హ్యూమన్ మెటాన్యుమో వైరస్’ (హెచ్‌ఎంపీవీ) మన దేశంలోకీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో తొలి కేసులు వెలుగుచూడగా తాజాగా మరో రెండు కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి
TV9 Telugu
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో 7, 14 ఏళ్ల వయసున్న ఇద్దరు చిన్నారులకు హెచ్‌ఎంపీవీ రస్ నిర్ధరణ అయ్యింది. చిన్నారులు ఇద్దరూ దగ్గు, జ్వరంతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు
TV9 Telugu
కోవిడ్ తర్వాత, ఇప్పుడు HMPV వైరస్ యావత్ ప్రజానికాన్ని కలవరం పుట్టిస్తుంది. HMPV వైరస్ కేసులు ఇప్పటికే చైనాలో లెక్కకు మించినమోదవుతున్నాయి. అక్కడి ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి
TV9 Telugu
బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న వ్యక్తులు త్వరగా ఈ వైరస్ బారీన పడుతున్నారు. అందువల్ల, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి కొన్ని ముఖ్య జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం
TV9 Telugu
అహ్మదాబాద్‌లో 2 నెలల శిశువులో ఈ వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. కర్ణాటకలో 3 నెలల బాలిక, 8 నెలల శిశువులో ఈ వైరస్ నిర్ధారనైంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 7 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి
TV9 Telugu
సోమవారం ఒక్క రోజే కర్ణాటక, తమిళనాడు, గుజరాత్‌లలో తొలి కేసులు వెలుగు చూశాయి. అయితే, దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తున్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు
TV9 Telugu
ముఖ్యంగా పిల్లల రోగనిరోధక శక్తి బలోపేతం చేయాలని చెబుతున్నారు. ఎందుకంటే HMPV వైరస్ నెలల శిశువులు, చిన్న పిల్లలకు ఎక్కువగా సోకుతుంది. దగ్గు, తేలికపాటి జ్వరం వంటి లక్షణాలు వీరిలో అధికంగా కనిపిస్తున్నాయి
TV9 Telugu
ఈ వైరస్ రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న పిల్లలలో అధికంగా వ్యాపిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో సహజంగా దొరికే కొన్ని రకాల ఆహారాలు పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి
TV9 Telugu
పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే సిట్రస్ పండ్లు, తేనె, వెల్లుల్లి, డ్రై ఫ్రూట్స్ వంటివి అధికంగా తినిపించాలని ఢిల్లీకి చెందిన ఆయుర్వేద వైద్యుడు ఆర్పీ పరాశర్ సూచిస్తున్నారు