వేడి పాలల్లో ఖర్జూరం కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
07 January 2025
TV9 Telugu
TV9 Telugu
ఖర్జూర పండును చూడగానే నోరూరుతుంది. ఇది రుచికరమైందే కాదు, ఆరోగ్యదాయిని కూడా. ఖర్జూరంలోని ఫ్రక్టోజ్, డెక్స్‌ట్రోజ్ వంటి సరళ పిండి పదార్థాలు సత్వరం శక్తినిస్తాయి
ఖర్జూరంలో ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, కాపర్, ఫైబర్, విటమిన్ బి6తోపాటు అనేక ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి
TV9 Telugu
ఖర్జూరంలోని ఈ పోషకాలు పెద్దపేగు, ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తులు, క్లోమ క్యాన్సర్ల నుంచి కొంతవరకు రక్షిస్తాయి. జియాగ్జాంతిన్ వృద్ధాప్యంలో రెటీనాలోని మాక్యులా క్షీణించకుండానూ కాపాడుతుంది
TV9 Telugu
ఖర్జూరం సహజ చక్కెర లాంటిది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో శక్తిని నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది
TV9 Telugu
ముఖ్యంగా చలికాలంలో ఖర్జూరం తినడం వల్ల జలుబు, దగ్గు రాకుండా రక్షణ కల్పించి, శరీరం వెచ్చగా ఉండేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు
TV9 Telugu
చలికాలంలో రాత్రిపూట వేడి పాలలో ఖర్జూరం వేసుకుని తింటే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది. అయితే వీటిని మీ శరీర స్వభావాన్ని బట్టి పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి
TV9 Telugu
రోజుకు 2 లేదా 3 ఖర్జూరాలు తీసుకుంటే సరిపోతుంది. అయితే మధుమేహ రోగులు, ఆరోగ్య సంబంధిత సమస్యలున్నవారు.. వీరి శరీర స్వభావం, వయస్సును బట్టి ఖర్జూరం తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది