Weight Loss: బరువు తగ్గాలని ఎవరు మాత్రం కోరుకోరు? ఎవరైతే బరువు పెరుగుతున్నామని ఫీల్ అవుతున్నారో వారు.. తమ బరువును తగ్గించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటారు. డైటింగ్ పాటిస్తుంటారు. వ్యాయామాలు చేస్తుంటారు. ఇంక రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే, బరువు తగ్గడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నచ్చిన ఆహారం తింటూనే బరువు తగ్గడం ఎలా..
మీరు కొన్ని కిలోల బరువు తగ్గాలని అనుకున్నప్పుడు.. రోజూ తినే ఆహారాన్ని తగ్గించాలని భావిస్తుంటారు. అయితే, ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవడానికి ఆహారం మీకు సహాయపడుతుంది. బరువు తగ్గడానికి ఇతర అనేక మార్గాలు ఉన్నాయి. బరువు తగ్గడం కష్టమైనప్పటికీ.. సరైన అంకితభావం, శ్రద్ధతో అది సాధ్యమే. అది కూడా ఇష్టమైన ఆహార పదార్థాలు తింటూనే బరువు తగ్గించుకోచ్చు.
వ్యాయామం ముఖ్యం..
బరువు తగ్గడానికి ప్రయత్నిస్తుంటే శారీరక శ్రమ చాలా ముఖ్యం. మీ శరీరం మీరు తినే అదనపు కేలరీలను బర్న్ చేయాలి. ఇందుకోసం రెగ్యూలర్‌గా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. బరువు తగ్గడంలో వ్యాయామానికి మించిన ముఖ్యమైన మార్గం లేదు. బరువు తగ్గడానికి తక్కువ తినడం సరైన మార్గం కాదు. కాకపోతే.. తిన్నదానికి తగినట్లుగా.. శారరీక శ్రమ కూడా చేస్తే ఆటోమాటిక్‌గా శరీర బరువు తగ్గుతుంది.
బుద్ధిపూర్వకంగా తినడం అలవాటు చేసుకోండి..
మీకు ఇష్టమైన ఆహారాన్ని వదులుకోవాల్సిన అవసరం లేకపోయినా.. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. మీకు కావాల్సిన దానికంటే అధికంగా తినకుండా ఉండండి. బరువు తగ్గాలనుకుంటుంటే.. ఆకలి అయినప్పుడు మాత్రమే తినాలి. నిరంతరం తినడం వల్ల ఆనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి.
ఆహారాన్ని సరిగ్గా నమలండి..
ఆహారాన్ని తినే విధానం కూడా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నెమ్మదిగా, సరిగ్గా ఆహారాన్ని నమలడం ద్వారా.. త్వరగా జీర్ణం అవుతుంది. తద్వారా జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. ఇక అతిగా తినడం కూడా మానాల్సి ఉంటుంది. అధిక కేలరీల ఆహారాలు తీసుకోవడం తగ్గించండి.
నీరు ఎక్కువగా తాగాలి..
అధిక బరువును నివారించడానికి.. భోజనానికి ముందు ఎక్కువ నీరు తాగే ప్రయత్నం చేయండి. తద్వారా ఆకలిని తగ్గించుకోవచ్చు. భోజనానికి ముందు ఎక్కువ నీరు తాగడం వల్ల ఎక్కువసేపు కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. అలా తక్కువగా తింటారు.
ఒత్తిడిని దరిచేరనీయకండి..
ఒత్తిడి, ఆందోళన, అతిగా తినడం, సమయం తప్పి తినడం.. వల్ల బరువు పెరిగే చాన్స్ ఉంది. ఇది కార్టిసాల్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది మీ ఆకలిని పెంచే ధోరణిని కలిగిస్తుంది. అందుకే.. ఒత్తిడికి గురికాకుండా ఉండండి. మానసిక స్థితిని మెరుగు పరిచే యోగా, ప్రాణయామం వంటివి సాధన చేయండి.
Also read:
Kabul: ప్రయాణికులతో కిక్కిరిసిన కాబుల్ విమానాశ్రయం.. రన్ వే పైనే ఎదురుచూపులు.. ఎందుకంటే?