
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (2021) ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, టైప్-2 డయాబెటిస్ ఉన్నవారు 8 వారాల పాటు ప్రతిరోజూ పచ్చి బీట్‌రూట్‌ను తీసుకుంటే వారి రక్తంలోని చక్కెర స్థాయిలు, రక్తపోటు గణనీయంగా తగ్గాయి. అంతేకాకుండా, ఇది మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుందని తేలింది. అదే సమయంలో, ఉడికించిన బీట్‌రూట్ జీర్ణక్రియకు ఎంతో సులభంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అద్భుతమైన కూరగాయ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి బీట్‌రూట్ వర్సెస్ ఉడికించిన బీట్‌రూట్:
పచ్చి బీట్‌రూట్ : ఇందులో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు గరిష్టంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు వాపులను తగ్గిస్తాయి. అథ్లెట్లకు స్టామినా పెంచడంలో ఇది ఎంతో తోడ్పడుతుంది.
ఉడికించిన బీట్‌రూట్ : బీట్‌రూట్‌ను ఉడికించడం వల్ల అందులోని పీచు పదార్థం మెత్తబడుతుంది, దీనివల్ల జీర్ణక్రియ సులభతరం అవుతుంది. ఉడికించిన తర్వాత కూడా ఇందులో పొటాషియం, మెగ్నీషియం మరియు ఐరన్ వంటి ముఖ్యమైన ఖనిజాలు అలాగే ఉంటాయి. అయితే, నీటిలో కరిగే విటమిన్లు వేడి వల్ల కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.
బీట్‌రూట్‌ను ఆహారంలో చేర్చుకునే 4 సులభమైన మార్గాలు:
జ్యూస్ లేదా స్మూతీ: బీట్‌రూట్‌ను ఆపిల్, క్యారెట్ లేదా ఆరెంజ్‌తో కలిపి జ్యూస్ లా చేసుకుని తాగితే అది ఒక అద్భుతమైన ‘డిటాక్స్ డ్రింక్’లా పనిచేస్తుంది.
సలాడ్స్: పచ్చి బీట్‌రూట్‌ను తురిమి ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ నట్స్‌తో కలిపి సలాడ్‌లా తీసుకోవచ్చు.
బీట్‌రూట్ రైతా: తురిమిన బీట్‌రూట్‌ను పెరుగులో కలిపి, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చాట్ మసాలా చల్లుకుంటే రుచికరమైన రైతా సిద్ధం.
బీట్‌రూట్ సబ్జీ లేదా పరాఠా: ఉడికించిన బీట్‌రూట్‌తో కూర వండుకోవచ్చు లేదా దానిని మెత్తగా చేసి పరాఠాల్లో స్టఫింగ్ లా వాడుకోవచ్చు. పిల్లలకు బీట్‌రూట్ పాన్ కేక్స్ కూడా ఒక మంచి హెల్తీ ఆప్షన్.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. మీ ఆహారంలో పెద్ద మార్పులు చేసే ముందు వైద్యుడిని సంప్రదించండి.