Diagnostics Hubs in Telangana : ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్స్ ఇతర రాష్ట్రాలకు దిక్సూచిగా నిలుస్తాయని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. జిల్లా కేంద్రాల్లో ఇటీవలే 19 డయాగ్నోస్టిక్ హబ్స్‌ను ప్రారంభించారని తెలిపిన కేటీఆర్.. ఈ టెస్టింగ్ సెంటర్స్ లో ఉచితంగా 57 రకాల పరీక్షలను చేస్తున్నారని చెప్పారు.
వీటికి తోడు రాష్ట్రవ్యాప్తంగా మరో 16 డయాగ్నోస్టిక్ హబ్స్‌ను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ సందేశంలో పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమానికి సంబంధించి ఆరోగ్య శాఖ కమిషనర్ కరుణ, డాక్టర్ అరుణ్, డాక్టర్ నందిత, డాక్టర్ ప్రసాద్‌కు కేటీఆర్ అభినందనలు తెలిపారు.
#Telangana becomes the torchbearer with the launch of state of the art #DiagnosticsHubs
19 D-Hubs have been launched in district HQs which will offer 57 different tests all free of cost
My compliments to Commissioner Health Karuna Garu & team Dr. Arun, Dr. Nandita & Dr.Prasad? pic.twitter.com/TnSOyHFHDe
— KTR (@KTRTRS) June 17, 2021
Read also : KTR’s letter to Nirmala Sitharaman : కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కి తెలంగాణ మంత్రి కేటీఆర్ లేఖ