ఎంత ఇంట్లో ఫుడ్ మంచిదైనా.. అప్పుడప్పుడు బయట ఫుడ్ కూడా టేస్ట్ చేయాలనిపిస్తుంది. అప్పుడప్పుడు బయట ఫుడ్ తినడంలో తప్పు లేదు కానీ.. దానిపైనే ఆధారపడితే మాత్రం చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ విషయం పక్కన పెడితే.. టిఫిన్స్ లో ఇప్పుడు చాలా రకరకాల వెరైటీలు వచ్చాయి. ఘీ కారం ఇడ్లీ, బటర్ ఇడ్లీ, ఘీ రోస్ట్ ఇడ్లీ, ఘీ కారం దోశ, ఘీ క్రిస్పీ రోస్ట్ దోశ, బటర్ కారం దోశ ఇలా ఎన్నో ఒక్కటేంటీ.. ఇలా ఓ పెద్ద లిస్టే ఉంటుంది. వాటిని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు టేస్ట్ చేస్తామా అని నోరూరుతుంది. అలా మనకు బయట ఎక్కువగా లభించే వెరైటీ దోశల్లో ఒకటి తీన్మార్ దోశ.. ఇది చాలా కలర్ ఫుల్ గా, టేస్టీగా, టెంప్టీగా ఉంటుంది. చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా. నోట్లో వేసుకోగానే ఇది అలా కరిగిపోతుంది. దీని వల్ల కూడా కొన్ని రకాల ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయనుకోండి. బయట తినడం ఇష్టపడని వారు ఈ దోశను కూడా మనం ఇంట్లోనే సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ తీన్మార్ దోశను ఎలా రెడీ చేసుకోవాలి? దీనికి కావాల్సిన పదార్థాలేంటో ఒకసారి చూసెద్దాం.
తీన్మార్ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు:
ఉల్లిపాయ తరుగు – 1, క్యారెట్ తురుము – ఒక కప్పు, బీట్ రూట్ తురుము – అర కప్పు, పన్నీర్ తురుము – అర కప్పు, క్యాబేజీ తురుము – ఒక కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్, బటర్ – కొద్దిగా, కొత్తిమీర – కొద్దిగా.
దోశ కారం తయారీకి కావాల్సిన పదార్థాలు:
టమాటాలు – 3, ఉల్లిపాయ – 1, వెల్లుల్లి రెబ్బలు – 2, నానబెట్టిన ఎండు మిర్చి – 10, ఆవాలు, జీలకర్ర – టీ స్పూన్, బెల్లం – చిన్న ముక్క, నూనె – 2 టీ స్పూన్స్, కరివేపాకు – కొద్దిగా. అలాగే ముందుగానే ఉడికించిన బంగాళ దుంపలతో ఆలు మసాలా తయారు చేసుకోవాలి.
తీన్మార్ దోశ తయారీ విధానం:
ముందుగా దోశ కారంకు సంబంధించిన పదార్థాలు చూశాం కదా.. అవన్నీ మిక్సీ పట్టుకుని, తాళింపు పెట్టుకోవాలి. నెక్ట్స్ స్టవ్ మీద పెనం పెట్టుకుని వేడెయ్యాక.. దోశ కాస్త పల్చగా వేస్తుకోవాలి. దోశ సగం కాలాక దానిపై క్యాబ్యేజీ, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, బీట్ రూట్ తురుము వేసుకున్నాక.. దోశ కారం, ఆలు మాసాలా, కొంచెం బటర్ వేసి, ఆ తర్వాత స్వీట్ కార్న్, పన్నీర్ తురుము వేసి స్మాష్ చేయాలి. ఇది దోశ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కావాలనుకున్న వారు చీజ్ వేసుకోవచ్చు. మళ్లీ దోశ మీద ఇంకొంచెం బటర్ వేసుకుని.. బాగా కాలిన తర్వాత ప్లేట్ లోకి తీసుకువాలి. అంతే తీన్మార్ దోశ రెడీ. ఎప్పుడూ ఒకే రకం దోశలు తిని బోర్ కొట్టిన వారు ఇలా వెరైటీగా తాయరు చేసుకోండి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి