Lungs Cancer: పెరుగుతున్న కాలుష్యంతో ముప్పు.. వీటిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే అంతే సంగతులు..

|

Nov 03, 2021 | 10:00 PM

Pollution - Lungs Cancer: ఆధునిక ప్రపంచంలో.. సీజన్ల వారీగా అందరూ ఆరోగ్యంపై శ్రద్ధవహించడం చాలాముఖ్యం. ముఖ్యంగా శీతాకాలంలో శరీరంలోని

Lungs Cancer: పెరుగుతున్న కాలుష్యంతో ముప్పు.. వీటిని జాగ్రత్తగా కాపాడుకోకపోతే అంతే సంగతులు..
Lungs Cancer
Follow us on

Pollution – Lungs Cancer: ఆధునిక ప్రపంచంలో.. సీజన్ల వారీగా అందరూ ఆరోగ్యంపై శ్రద్ధవహించడం చాలాముఖ్యం. ముఖ్యంగా శీతాకాలంలో శరీరంలోని ప్రధాన అవయవమైన ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఓ వైపు వేగంగా వ్యాపిస్తున్న కరోనావైరస్.. మరోవైపు పెరుగుతున్న కాలుష్యం కారణంగా ప్రజల ఊపిరితిత్తులు బలహీనమవుతున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. ఊపిరితిత్తుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించకపోతే.. ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌ ముఖ్యంగా ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపిందని.. వైద్యులు పేర్కొంటున్నారు. కరోనా సోకిన వారికి ఊపిరితిత్తులు బలహీనంగా మారాయి. ఇలాంటి పరిస్థితిలో కాలుష్యం ఇంకా ప్రమాదకరంగా మారుతుందని.. కావున ప్రజలు జాగ్రత్తగా తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. శరీరంలోని విష కణాలు అవసరానికి మించి పెరగడం ప్రారంభిస్తాయో అప్పుడు క్యాన్సర్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇది ఊపిరితిత్తుల క్యాన్సర్ కు దారితీస్తుందని పేర్కొంటున్నారు. రోజూ ధూమపానం చేసేవారు లేదా ఊపిరితిత్తులకు సంబంధించిన ఏదైనా వ్యాధి ఉన్నవారు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. అనేక సందర్భాల్లో పెరుగుతున్న కాలుష్యం కారణంగా బలహీనమైన ఊపిరితిత్తులు క్యాన్సర్‌ బారిన పడినట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎయిమ్స్‌ ప్రొఫెసర్ డాక్టర్ నీరజ్ నిశ్చల్ మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఆక్సిజన్ సపోర్టు లేదా వెంటిలేటర్‌పై ఉంచిన రోగులు చాలా మంది ఉన్నారని.. వారి ఊపిరితిత్తులు బలహీనంగా ఉండవచ్చని పేర్కొన్నారు. కోవిడ్‌ తర్వాత కూడా ఊపిరితిత్తుల సమస్యలు ఎక్కువగా కనిపించాయని.. ఇలాంటి పరిస్థితుల్లో కలుషిత వాతావరణానికి దూరంగా ఉండాలని సూచించారు.

ఈ వ్యాధి ఏ వయసులోనైనా రావచ్చు..
ఊపిరితిత్తుల వ్యాధులు ఏ వయసులోనైనా వస్తాయని వైద్యులు చెబుతున్నారు. 30 నుంచి 35 సంవత్సరాల వయస్సు ఉన్నవారికి తక్కువ ప్రమాదం ఉన్నప్పటికీ, ఈ వయస్సులో వారికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశముందని అధ్యయనాలు తెలిపాయి. కాబట్టి ప్రజలందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే క్యాన్సర్‌ను ప్రాథమిక దశలో గుర్తిస్తే, శస్త్రచికిత్స ద్వారా రోగిని నయం చేయవచ్చు. రెండు లేదా మూడవ దశలో వస్తే.. కీమోథెరపీ చేయాల్సి ఉంటుంది. కావున ఊపిరితిత్తుల పనితీరుకు సంబంధించిన ఏవైనా లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇవి క్యాన్సర్‌కు తొలి సంకేతాలు..
దగ్గు తర్వాత స్వరంలో మార్పు.
దగ్గుతున్నప్పుడు నోటి నుంచి రక్తం.
భుజాలు, వెనుక భాగం, కాళ్ళలో నొప్పి.
ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు ఈల శబ్దం.
బలహీనత, ఆకలి లేకపోవడం.
వేగవంతంగా బరువు తగ్గడం.
ఎప్పుడూ అలసటగా ఉండటం.

బలమైన ఊపిరితిత్తుల కోసం..
ఊపిరితిత్తులను పటిష్టం చేసే వ్యాయామాలు చేయండి.
బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించండి.
ధూమపానానికి దూరంగా ఉండాలి.
దగ్గు తీవ్రంగా ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Also Read:

Vitamin B12: మీ కాలి వేళ్లలో ఈ లక్షణాలు ఉన్నాయా..! అయితే విటమిన్ B12 లోపం.. చాలా డేంజర్‌..

PM Narendra Modi: ఎప్పటిలానే ప్రధాని మోదీ దీపావళి వేడుకలు.. ఈ సారి ఎక్కడంటే..?