Ragi Java: ఎండకాలంలో రాగిజావ తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి.. రాగుల్లో ఉండే ప్రోటీన్స్‌ ఏమిటి..?

| Edited By: Shiva Prajapati

Apr 13, 2021 | 9:12 AM

Ragi Java: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నారు. తీవ్రమైన ఎండలతో సొమ్మసిల్లిపడిపోతున్నారు. బయటకు వెళ్లాలంటే తగు...

Ragi Java: ఎండకాలంలో రాగిజావ తాగితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి.. రాగుల్లో ఉండే ప్రోటీన్స్‌ ఏమిటి..?
Ragi Java
Follow us on

Ragi Java: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. బయటకు వెళ్లాలంటేనే జనాలు జంకుతున్నారు. తీవ్రమైన ఎండలతో సొమ్మసిల్లిపడిపోతున్నారు. బయటకు వెళ్లాలంటే తగు జాగ్రత్తలు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే వడదెబ్బ బారిన పడి మరణాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శరీరంలో నీటి శాతం తగ్గడంతో పాటు శక్తి కూడా తగ్గిపోతుంది. అందుకే శరీరంలో చలువని పెంచేందుకు మన పూర్వీకుల జావను తయారు చేసుకుని తాగేవారు. మొదట్లో జవాల వాడకం తక్కువగా ఉన్నా.. ఈ మధ్య కాలంలో వీటి ప్రాధాన్యత పెరిగింది. జవాలు చేసే ఉపయోగాలు తెలిసినప్పటి నుంచి వీటి వాడకం ఎక్కువైపోయింది. అయితే జావను ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు. ఎండాకాలంలో జావాల వల్ల కలిగి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

రాగిజావ..

ఎంతో ఇష్టంగా తినే ఫుడ్స్‌ను సైతం పక్కన పెట్టేస్తాం. ఒక సమయంలో ఫుడ్‌ తినాలని అనిపించనప్పుడు రాగిజావ తయారు చేసుకోవడం ఎంతో ఉత్తమం. రాగిజావను ఇంట్లోనే ఉండి తయారు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి. ఉల్లి, కరివేపాకు, కొత్తిమీర, పెరుగు. ముందుగా రెండు చెంచాలు రాగిపిండిని కప్పులో బాగా కలుపుకోవాలి. అందులో రెండు గ్లాసుల నీళ్లు పోసి తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. బాగా మరిగిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇష్టమైన వాళ్లు కరివేపాకు, కొత్తిమీర తరుగు, ఉల్లిపాయల ముక్కలు వేసుకుని దింపేయాలి. వేడి తగ్గకన్న ముందే బౌల్‌లో జావను తీసుకుని అందులో పెరుగు కలుపుకొని తాగితే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఒక వేళ రాగిజావ కాస్త తియ్యగా చేసుకోవాలంటే రాగి పిండిలో బెల్లం ముక్క వేసుకుని అరగ్లాసు పాలు కలిపి ఉడికించుకోని తాగాలి.

ఉపయోగాలు..

రాగుల్లో పుష్కలంగా కాల్షియం ఉంటుంది. ఇది ఎముకలు దృఢంగా ఉంచడంతో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రోటీన్లు, విటమిన్లు, ఏ,బీ,సీ ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రాగుల్లో మినరల్స్‌ కూడా ఎక్కువగా ఉంటాయి. మిగిలిన ధాన్యాల్లో కంటే ఇందులో కాల్షియం 5-30శాతం ఎక్కువగా ఉంది. ఇందులో ఫాస్ఫరస్‌, పోటాషియం, ఐరన్‌ కూడా ఎక్కువగా ఉన్నాయి. కాల్షియం సప్లిమెంట్‌ తీసుకునే బదులు రాగులు తినడం మంచిది. వీటిని తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా మారతాయి. అందుకే వయసు పెరిగిన వారు.. చిన్నపిల్లలు వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలి.

అలాగే మధుమేహం ఉన్నవారు కాంప్లెక్స్‌ కార్పోహైడ్రేట్స్‌, పీచు పదార్థాలు, ఫైటో కెమికల్స్‌ ఎక్కువగా ఉన్న ధాన్యపు పై పొరలో ఉంటాయి. రాగుల పై పొరలో మిగిలిన ధాన్యాలకంటే ఎక్కువ పాలిఫినాల్స్ ఉంటాయి. రాగులు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గించడమే కాకుండా హైపోగ్లెసీమిక్ స్ట్రెస్ ని తగ్గిస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో గాయం తొందరగా తగ్గడానికి కూడా ఇవి ఎంతగానో సహకరిస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం మంచిది.

బార్లీ జావ:

ఒక కప్పు బార్లీ గింజలను ముందుగా నానబెట్టుకోవాలి. ఆ తర్వాత తగినన్నీ నీళ్లు పోసుకుని ఉడికించుకోవాలి. మజ్జిగ, ఉప్పు, జీకర్ర పొడి కలుపుకోవాలి. తాగేటప్పుడు నిమ్మరసం వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. రుచి కావాలంటే దానిమ్మ గింజలను కూడా వేసుకోవచ్చు. బార్లీజావలో పీచు పదార్థాలు ఎక్కువ. అందుకే త్వరగా ఆకలి వేయదు. బరువును నియంత్రిస్తుంది. జలుబు వంటి సమస్యలను దూరం చేస్తుంది.