Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..! ఇంకా వీటితో ఎన్ని లాభాలో తెలుసా..?

రొయ్యలు మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. ఇవి మెదడు శక్తిని పెంచుతాయి. రక్త ప్రసరణ మెరుగుపడేలా చేస్తాయి. ఎముకలు కూడా బలపడుతాయి. ఆరోగ్యంగా జీవించాలంటే రొయ్యలు ఆహారంలో ఉండటం మంచిది. శరీరానికి కావాల్సిన పోషకాలు ఇందులో లభిస్తాయి. రొయ్యల్లో ప్రోటీన్, విటమిన్ డి, కాల్షియం, పొటాషియం, ఒమేగా 3 వంటి ఎన్నో పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎముకలు దృఢంగా తయారవుతాయి.

ఎముకలు బలంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే..! ఇంకా వీటితో ఎన్ని లాభాలో తెలుసా..?
Prawns Health Benefits
Follow us
Prashanthi V

|

Updated on: May 18, 2025 | 8:49 PM

గర్భిణులు రొయ్యలు తినొచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే ఐరన్, అయోడిన్ శరీరానికి అవసరం. ఇది థైరాయిడ్ హార్మోన్ల స్రావాన్నిపెంచుతుంది. ఈ హార్మోన్లు శిశువు మెదడు అభివృద్ధికి అవసరం. అయితే రొయ్యలను చాలా శుభ్రంగా వండాలి.. బాగా ఉడకబెట్టాలి. అప్పుడే తినడం సురక్షితం.

వర్షాకాలం రొయ్యల పునరుత్పత్తికి అత్యంత అనుకూల సమయం. ఎందుకంటే రొయ్య పిల్లలు ఎక్కువగా ఈ కాలంలోనే ఏర్పడతాయి. కాబట్టి ఈ కాలంలో తీసుకునే రొయ్యలు నాణ్యతగా ఉండాలి. కొనుగోలు చేసే ముందు చూసుకోవాలి. ఉపయోగించే ముందు నల్ల సిరను శుభ్రం చేయాలి.

రొయ్యలలో ఉండే సన్నని నల్ల సిరను తొలగించకపోతే జీర్ణక్రియ దెబ్బతింటుంది. పేగుల్లో ఇబ్బందులు వస్తాయి. అలెర్జీలు రావచ్చు. శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కలగవచ్చు. అందుకే బాగా శుభ్రం చేయాల్సి ఉంటుంది.

రొయ్యల్లో కొవ్వు తక్కువగానే ఉంటుంది. కానీ కొలెస్ట్రాల్ మాత్రం ఎక్కువగా ఉంటుంది. గుండె సమస్యలు ఉన్నవారు దీన్ని తినడం మానాలి. అయితే బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం. కార్బోహైడ్రేట్లు లేకపోవడం వల్ల ఇది లైట్ ఫుడ్‌గా ఉపయోగపడుతుంది.

రొయ్యల్లో అస్టాక్సంతిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది జ్ఞాపకశక్తిని పెంచుతుంది. మెదడు కణాలు బలపడతాయి. మెదడులో వాపు తగ్గుతుంది. హెపారిన్ అనే పదార్థం దృష్టి నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుంది.

రొయ్యల్లో ఉండే జింక్ జుట్టు పెరుగుదల కోసం సహాయపడుతుంది. కొత్త కణాలు చర్మం, జుట్టులో బలంగా తయారవుతాయి. జుట్టు రాలిపోవడం, పెరుగుదల ఆగిపోవడం వంటి సమస్యలకు ఇది సహాయపడుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతుంది.

ఐరన్ పుష్కలంగా ఉండటంతో రక్తహీనత సమస్యలు ఉన్నవారు తినవచ్చు. ఇది శరీరానికి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. కండరాలకు ఆక్సిజన్ బాగా అందుతుంది. హిమోగ్లోబిన్ పనితీరు మెరుగుపడుతుంది.

రొయ్యల్లో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్లు ఉండటంతో ఎముకలు బలంగా తయారవుతాయి. కెరోటినాయిడ్లు అనేక రకాల క్యాన్సర్లను నివారించగలవు. సెలీనియం అనే అరుదైన ఖనిజం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పోరాడుతుంది.

రొయ్యలు ఆరోగ్యానికి మేలు చేసే ఆహారంగా చెప్పవచ్చు. సరైన శుభ్రత, సమయానుసారంగా రొయ్యలను ఆహారంలో వాడితే అన్ని వయస్సుల వారికీ ప్రయోజనం కలుగుతుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)